Heart Care: ఈ ఎక్సర్‌సైజ్‌లతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి..
Heart Exercise: ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి అనేక వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది
Heart Exercise: ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి అనేక వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు మీ గుండె (heart disease) ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేయాలి. గుండెను దృఢంగా మార్చడానికి వ్యాయామం ఉత్తమమైన మార్గం. శారీరకంగా చురుకుగా ఉండే వారి గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం గుండె కండరాలను బలపరుస్తుంది. దీంతోపాటు ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది. వ్యాయామం చేయడం వల్ల హై బ్లడ్ షుగర్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుంది. వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. హృదయం దృఢంగా ఉండాలంటే ఈ 5 రకాల వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..
గుండెను రక్షించే వ్యాయామాలు
నడక: వేగంగా నడవడం ద్వారా మీ హృదయం దృఢంగా మారుతుంది. నడకతో మీ హృదయ స్పందన వేగంగా ఉంటుంది. ఇది మీ ఎముకలపై పెద్దగా ప్రభావం చూపదు. అందుకే రోజూ ఒక గంటపాటు నడవడం మంచిది. కావాలంటే లంచ్ బ్రేక్ లో కూడా ఆఫీసులో నడకను అలవాటు చేసుకోండి..
వ్యాయామం: శరీరంలో కండరాలను నిర్మించడంతోపాటు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా కండరాలను బలోపేతం చేసుకోవడంతోపాటు.. కొవ్వునూ కరిగించుకోవచ్చు. పుష్-అప్స్, స్క్వాట్, పుల్-అప్‌లు చేయడం మంచిది. ఈ వ్యాయామాలు కండరాలను నిర్మించడంలో సహాయపడటంతోపాటు ఎముకలు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సైక్లింగ్: గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు రోజూ సైక్లింగ్ చేయడం చాలా మంచిది. సైక్లింగ్ గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కాలి కండరాలను బలపరుస్తుంది. దీంతో గుండె వేగం పెరుగుతుంది. సైక్లింగ్ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది
స్విమ్మింగ్: ఈత గుండెకు చాలా మంచి వ్యాయామం. వాటర్ ఏరోబిక్స్ లేదా స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు శరీరంతోపాటు గుండెను కూడా దృఢంగా మారుస్తాయి. ఇతర వ్యాయామాలతో పోలిస్తే ఈత గుండెకు మంచి వ్యాయామం.
యోగా: యోగా చేయడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయి. మీ హృదయ స్పందనను పెంచే అనేక యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలు వేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండవచ్చు. దీంతోపాటు రక్తపోటు కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉత్తమమైన వ్యాయామం.
Also Read: