Medicinal Uses of Jaggery : ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బెల్లాన్ని రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Medicinal Uses of Jaggery : భారతీయుల వంటల్లో బెల్లం ఒక ముఖ్య భాగం.. పంచదార రాక ముందు బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమంలో పంచదార బెల్లం ప్లేస్ ను ఆక్రమించింది...

Medicinal Uses of Jaggery : ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బెల్లాన్ని రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
Jaggery
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2021 | 3:18 PM

Medicinal Uses of Jaggery : భారతీయుల వంటల్లో బెల్లం ఒక ముఖ్య భాగం.. పంచదార రాక ముందు బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమంలో పంచదార బెల్లం ప్లేస్ ను ఆక్రమించింది. అయితే బెల్లం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం.. ఇందులో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. ఇప్పుడు . తియ్యని పిండివంటలు తయారీలో మాత్రమే ఉపయోగిస్తున్న ఈ బెల్లాన్ని ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా చాలా రకాల మందులలో వాడతారు. ఈరోజు బెల్లం రోజు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

* పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసిఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది. *భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది *బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది. *ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి. *బెల్లం లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం ఆరోగ్యానికి మంచిది. *బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు ని నివారిస్తుంది .*బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే,బెల్లం తింటే ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్నితింటే తక్షణ శక్తి వస్తుంది. *బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. *బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు. *బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. *ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే పచ్చ కామెర్లు వారికి మంచిది *అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలో ని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి. *కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు), మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపూటల వారం రోజులు తీసుకున్నా, లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన … నెలసరి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. *బెల్లం, నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .

ఇలాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని ‘మెడిసినల్‌ సుగర్‌’గా వ్యవహరిస్తారు

Also Read: ఎముకల్లో క్యాల్షియం తక్కువగా ఉందా.. ఎర్రతోటకూరను తింటే సరి.. పొడికూర ఎలా చేసుకోవాలంటే