బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి

Former MP Gangula Pratap Reddy Joins BJP, బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి

వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ నేత మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే.. చాలా మంది బీజేపీలో చేరుతున్నరని తెలిపారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇంకా చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నామని పేర్కొన్నారు బీజపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *