AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

Dr. Yethindra Vityala: తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం.. డాక్టర్ యతీంద్ర విట్యాలకు కలాం మెడల్

Dr. Yethindra Vityala: డాక్టర్ యతీంద్ర సేవలు పరిశోధనపత్రాల రచనకే పరిమితం కాలేదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించిన ఆయన, 200 పైగా పరిశోధనపత్రాలను సమీక్షించారు. విద్యార్థులు యువ పరిశోధకుల్లో శాస్త్రీయ రచన, పరిశోధన పద్ధతులు, ఆధారాలను విశ్లేషించే నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు..

Dr. Yethindra Vityala: తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం.. డాక్టర్ యతీంద్ర విట్యాలకు కలాం మెడల్
Dr. Yethindra Vityala
Subhash Goud
|

Updated on: Oct 12, 2026 | 4:20 PM

Share

Dr. Yethindra Vityala: తెలంగాణ కు చెందిన వైద్య శాస్త్రవేత్త యతీంద్ర విట్యాలకు అరుదైన గౌరవం లభించింది. వైద్య పరిశోధనలను ఆచరణాత్మక ఆవిష్కరణలతో అనుసంధానించే దిశగా చేస్తున్న కృషికి ఆయన ” కలాం మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ట్రాన్సిలేషన్ ఇన్నోవేషన్ ” పురస్కారాన్ని అందుకున్నారు సెప్టెంబర్ 19, 2026 న హర్యానా లోని గురుగ్రామ్ లో జరిగిన “ది నెక్స్ట్ జీన్ బయో సైన్స్ సమ్మిట్ -2026 ” ఈ పురస్కార ప్రదానానికి వేదికైంది.

గురుగ్రామ్‌లోని DLF సైబర్ పార్కులో ఉన్న మాస్టర్స్ యూనియన్ కు చెందిన కలాం స్కూల్ అఫ్ బయోసైన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది “కలాం మెడల్ ఫర్ ఇండివిడ్యుయల్ ఎక్స్లెన్స్ ” విభాగంలో డాక్టర్ యతీంద్ర ఈ పురస్కారాన్ని అందుకున్నారు వైద్యం, పరిశోధన, విద్య, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో ఆయన సాగిస్తున్న ప్రయాణంలో ఈ పురస్కారం మరో మైలురాయిగా నిలిచింది.

వైద్యం నుంచి పరిశోధనల వరకు ..

వైద్యుడిగా, శాస్త్రవేత్తగా, అసోసియేట్ ప్రొఫెసరుగా సేవలందిస్తున్న డాక్టర్ యతీంద్ర విట్యాల..SCIVYT రీసెర్చ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నారు. వైద్య పరిశోధనల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానాలు వెతకడంతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగకరమైన పరిష్కారాలుగా అభివృద్ధి చేయడంపై ద్రుష్టి సారిస్తున్నారు. ఆయన పరిశోధనాసక్తులు క్లినికల్ రీసెర్చ్, ట్రాన్సిలేషన్ మెడిసిన్, అంటువ్యాధులు, క్యాన్సర్ వైద్యం, నాడి సంభందిత వ్యాధులు, ప్రజారోగ్యం వంటి విభాగాల్లో విస్తరించాయి. 110 కి పైగా శాస్త్రీయ సమీక్ష పొందిన పరిశోధనపత్రాలను రచించిన ఆయన, 45 కి పైగా అంతర్జాతీయ శాస్త్రీయ ప్రదర్శనల్లో తన పరోశోధనలను వివరించారు. పదికి పైగా దేశాలతో పరిశోధన సహకారాలు ఆయన వృత్తిపరమైన ప్రయాణంలో భాగమయ్యాయి.

ట్రాన్సిలేషన్ ఇన్నోవేషన్ అంటే ఏమిటి?

పరిశోధనల్లో లభించిన జ్ఞానాన్ని ఆచరణలో ఉపయోగించగల పద్ధతులు, సాంకేతికాలు లేదా పరిష్కారాలుగా మలిచే ప్రక్రియను ట్రాన్సిలేషన్ ఇన్నోవేషన్ అంటారు. వైద్య రంగంలో ఇది వ్యాధి నిర్ధారణ విధానాలు, చికిత్స వ్యూహాలు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవల అభి వృద్ధికి దోహద పడుతుంది. ఒక శాస్త్రీయ ఆలోచన ఉపయోగకరమైన పరిష్కారంగా మారాలంటే అనేక దశల్లో పరిశీలన, పరీక్షలు, ఆధారాల సమీక్ష అవసరం. వైద్యులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు సమన్వయం కూడా కీలకం. ఈ రంగంలో కృషికి గుర్తింపుగా డాక్టర్ యతీంద్ర విట్యాలకు కలాం మెడల్ లభించింది.

వెయ్యి మందికి పైగా విద్యార్థులకు మార్గదర్శకత్వం:

డాక్టర్ యతీంద్ర సేవలు పరిశోధనపత్రాల రచనకే పరిమితం కాలేదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించిన ఆయన, 200 పైగా పరిశోధనపత్రాలను సమీక్షించారు. విద్యార్థులు యువ పరిశోధకుల్లో శాస్త్రీయ రచన, పరిశోధన పద్ధతులు, ఆధారాలను విశ్లేషించే నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. పరిశోధనల్లో సరైన ప్రశ్నలను ఎంచుకోవడము నుంచి ఫలితాలను స్పష్టంగా వివరించడం వరకు ప్రతి దశలో మార్గదర్శకత్వం అవసరం. ఈ నేపథ్యంలో ఆయన బోధన, పరిశోధనా శిక్షణ కార్యకలాపాలు తదుపరి తరం వైద్యులు, పరిశోధకుల అభి వృద్ధిలో ముఖ్యమైన భాగంగా నిలుస్తున్నాయి.SCIVYT ద్యారా పరిశోధనా సహకారం, విద్య, సాంకేతిక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నారు. విద్యా బాధ్యతలతో పాటు సంస్థను నిర్మిస్తూ, విభిన్న రంగాల నిపుణులను ఒక లక్ష్యం చుట్టూ సమన్వయం చేయడం ఆయన ప్రయాణం లోని మరో కోణం.

ప్రపంచ రికార్డులు .. అంతర్జాతీయ పురస్కారాలు:

వైద్య రంగంలో ” ప్రపంచములోనే అత్యంత చిన్న వయస్కుడైన శాస్త్రవేత్త ” గా గుర్తింపు పొందిన డాక్టర్ యతీంద్ర మొత్తం 12 ప్రపంచ రికార్డులను సాధించారు. 2020 లో అత్యంత పొడవైన పుస్తక శీర్షికకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. ఆయన ఇటీవలి గౌరవాల్లో ” ఇంటర్నేషనల్ ఫీజిషియన్-సైంటిస్ట్ అఫ్ ది ఇయర్ -2026 ” గుర్తింపు తో పాటు, నాశిక్ లో జరిగిన ASCO డైరెక్ట్ జిఐ క్యాన్సర్ సింపోజియం-2026 లో బెస్ట్ పోస్టర్, బెస్ట్ ప్రెజెంటర్ పురస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు కలాం మెడల్‌తో ఆయన విజయాలు జాబితాలో మరో విశిష్ట గుర్తింపు చేరింది. తెలంగాణ నుంచి వైద్యం, పరిశోధన, విద్య, ఆవిష్కరణ రంగాల్లో విస్తృతంగా పని చేస్తున్న డాక్టర్ యతీంద్ర విట్యాల ప్రయాణం.. శాస్త్ర వేత్తలుగా ఎదగాలనుకునే యువతకు స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు