AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి.. బిర్యానీని మించిన రుచి

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు.. త్వరగా వంట చేయాలనుకున్నప్పుడు ఈ టేస్టీ రెసిపీ బెటర్. కేవలం ఉల్లిపాయలతో బిర్యానీ రుచిని తలపించే ఈ వంటకాన్ని కుక్కర్‌లో సులభంగా, చాలా ఫాస్ట్ గా ఇంట్లోనే తయారుచేయవచ్చు. లంచ్ బాక్సులకు కూడా ఇది సరైన ఎంపిక.

Prasanna Yadla
|

Updated on: Oct 12, 2026 | 3:40 PM

Share
ముందుగా ఒక బౌల్లోకి పావుకిలో బియ్యం తీసుకుని బాగా కడిగి, మళ్ళీ నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. బియ్యం నానేలోగా ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవచ్చు.ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి ఆయిల్ బాగా వేడయ్యాక, బిర్యానీ ఆకులు, ఒకటి రెండు స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, రెండు మూడు యాలకులు, లవంగాలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, అర టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయాలి.

1 / 5
ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలను వేసి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు సరిగ్గా వేగితేనే పులావ్‌కు మంచి రుచి వస్తుంది.ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్‌లోకి వచ్చాక, రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, ఫ్రెష్ గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి.

2 / 5
ఇవి చక్కగా ఫ్రై అయ్యాక, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్ల కారం, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని వేయాలి. తరువాత, బాగా మిక్స్ చేసిన అర కప్పు పెరుగును వేసి, మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలపాలి. చివరగా, కొద్దిగా పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా తీసుకుని, కుక్కర్‌లోని మసాలాతో కలిపి స్లోగా రెండు నిమిషాలు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా కలపనవసరం లేదు. ఒకసారి కలిపి నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఆ తర్వాత మరొకసారి స్లోగా కలపాలి.

3 / 5
బియ్యానికి తగినంత నీళ్లు పోయాలి. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసుకు ఒకటింపావు గ్లాసు నీళ్లు, నార్మల్ బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసు నీళ్లు తీసుకోవాలి. ఒకవేళ గిన్నెలో వండుతున్నట్లయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పడతాయి. ఇందులోనే రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ఒకసారి బాగా కలిపి, ఉప్పు రుచి చూడాలి. ఈ సమయంలోనే ఉప్పు సరిపోకపోతే సరిచేసుకోవాలి.
కుక్కర్ మూత పెట్టి, ఒక విజిల్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి, విజిల్ లోని గాలి పూర్తిగా నార్మల్‌గా పోయాక మూత తీసి చూడాలి.

బియ్యానికి తగినంత నీళ్లు పోయాలి. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసుకు ఒకటింపావు గ్లాసు నీళ్లు, నార్మల్ బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసు నీళ్లు తీసుకోవాలి. ఒకవేళ గిన్నెలో వండుతున్నట్లయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పడతాయి. ఇందులోనే రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ఒకసారి బాగా కలిపి, ఉప్పు రుచి చూడాలి. ఈ సమయంలోనే ఉప్పు సరిపోకపోతే సరిచేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి, ఒక విజిల్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి, విజిల్ లోని గాలి పూర్తిగా నార్మల్‌గా పోయాక మూత తీసి చూడాలి.

4 / 5

ఉల్లిపాయ పులావ్ రెడీ అయిన వెంటనే సర్వ్ చేయకుండా, ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిగా వచ్చి, మసాలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టుకుని మరింత రుచిగా ఉంటుంది. ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తింటే  కమ్మగా ఉంటుంది.

5 / 5
Follow Us