Allu Arjun: ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన మేకర్స్.. అల్లు అర్జున్, లోకేష్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

పుష్ప సినిమా తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పూర్తిగా రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన ఫోటోస్ క్యూరియాసిటిని కలిగించాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతోపాటు బన్నీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి ఇదివరకే ప్రకటన వచ్చింది. అనౌన్స్మెంట్ వీడియో సైతం రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి మరో అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ హాల్చల్ చేశాయి. గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న రూమర్స్ అన్నింటికి ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఒక్క ఫోటోతోనే లోకీ, బన్నీ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ త్వరలోనే అంటూ డైరెక్ట్ర లోకేశ్ కనగరాజ్ ట్వీట్ చేశాడు. అలాగే బన్నీతో మాట్లాడుతున్న ఫోటోను సైతం జత చేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
ఇదిలా ఉంటే.. జవాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల ప్రభంజనాన్ని సృష్టించిన అట్లీ.. ఇప్పుడు బన్నీతో కలిసి మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు.ఈ సినిమా నిర్మాణంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించినట్లు సమాచారం. ఇందులో రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ సైతం కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
లోకేష్ కనగరాజ్ ట్వీట్..
Interesting updates coming soon 💥💥💥@alluarjun 🔥🔥 @MythriOfficial @anirudhofficial https://t.co/XcycmgMXZX
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 12, 2026
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
