AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరాత్రులు… మీ కలలో అమ్మవారు కనిపించారా? దీని సంకేతం ఇదే

ప్రతి పల్లె పట్నంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొమ్మది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇస్తుంది. భక్తులపై తన అనుగ్రహం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని నిష్టగా పూజిస్తుంటారు. దుర్గామాత మాల వేసుకొని నిత్యం అమ్మవారి జంపం చేస్తూ ఉపవాసాలు, నియమ నిబంధనలతో దుర్గామాతను పూజిస్తుంటారు.

Samatha J
|

Updated on: Oct 12, 2026 | 3:39 PM

Share
అయితే ఈ సమయంలో చాలా మందికి కలలు వస్తుంటాయి. ఒకొక్కరికీ ఒక్కో విధమైన కలలు రావడం సహజం. అయితే అసలు నవరాత్రుల సమయంలో కలలో దుర్గామాత కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. దీనికి గురించి స్వప్నశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో దుర్గామాత కనిపించడం చాలా శుభ ప్రదం అంటున్నారు పండితులు.  అయితే దుర్గాదేవి కనిపించిన తీరు అనేది వ్యక్తి జీవితం ప్రభావం చూపిస్తుందంట. అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇస్తుంటారు. కాగా, కలలో ఏ రూపంలో చూడటం శుభం అనేదాని గురించి మనం తెలుసుకుందాం. కలలో దుర్గామాత విగ్రహం లేదా చిత్రాన్ని చూడటం అత్యంత శుభప్రదమైనది. దీని వలన మీ మీరు జీవితంలోని కష్టాల నుంచి బయటపడబోతున్నారు అనే అర్థం వస్తుందంట.

2 / 5
సింహంపై స్వారీ చేస్తున్నట్లు కనిపించడం,  స్వప్న శాస్త్రం ప్రకారం, దుర్గాదేవి సింహ వాహనంపై స్వారీ చేస్తున్నట్లు కల వచ్చిందంట ఇది చాలా అదృష్టం. ఇది మీ జీవితంలో పురోగతి, మీకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చూపిస్తుంది అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా అమ్మవారు ఎర్రని వస్త్రాల్లో కనిపించడం కూడా చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.

3 / 5
ముఖ్యంగా అమ్మవారు పెళ్లి కాని స్త్రీల కలలో ఎర్రటి వస్త్రంలో కనిపిస్తే వారికి త్వరలో వివాహం జరుగుతుందని అర్థం. పెళ్లైన వారికి అలాంటి కల వస్తే తన భర్త దీర్ఘాయుషును ఇది సూచిస్తుందంట. అంతే కాకుండా కలలో దుర్గాదేవి  మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు కల రావడం కూడా చాలా మంచిది. ఇది మిమ్మల్ని కష్టాల నుంచి బయటకు తీసుకొస్తున్నట్లు అర్థం.

4 / 5
కలలో దుర్గాదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అంటే, మీ  బాధలు కష్టాలు త్వరలోనే తీరుతాయని అర్థం. అలాగే దుర్గాదేవిని మీరు ఉగ్రరూపంలో ఉన్నట్లు కలలో చూడటం అది ఒక హెచ్చరిక. దుర్గాదేవి కోపంగా కనిపించింది అంటే స్వప్నశాస్త్రం ప్రకారం, మీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఉదయాన్ని స్నానం చేసి దుర్గాదేవిని పూజించి క్షమాపణ చెప్పాలి. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us