Pawan Kalyan: పవన్ కల్యాణ్ మొదటి సినిమా రిలీజై 30 ఏళ్లు.. అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నటించిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996 అక్టోబర్ 11న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ, ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న సేవలను, సమాజం కోసం అందిస్తున్న తన వంతు కృషిని అభినందించారు. పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, మరోసారి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ తన ఆశీస్సులు అందించారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం సినీ రంగంతో పాటు ప్రజా జీవితంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 30 ఏళ్ల సినీ ప్రస్థానం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
కాగా పవన్ కల్యాణ్ నటించిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈవీవీ సత్య నారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత, నాగార్జున మేనకోడలు సుప్రిత హీరోయిన్ గా చేసింది. గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. 1996 అక్టోబర్ 11న విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ముఖ్యంగా చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ కు గ్రాండ్ డెబ్యూ లభించింది.
గీతా ఆర్ట్స్ ట్వీట్..
On the occasion of 30 years of Deputy Chief Minister of Andhra Pradesh, Sri @PawanKalyan garu in Cinema, a heartfelt note from Sri #AlluArvind garu.❤️ https://t.co/MXH5gTijFx
— Geetha Arts (@GeethaArts) October 12, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
