AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజనీకి విలన్‌గా టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఇదే నిజమైతే..!

ఈ ఏడాది 'దర్బార్‌'తో ప్రేక్షకులను పలకరించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Rajinikanth: రజనీకి విలన్‌గా టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఇదే నిజమైతే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2020 | 2:07 PM

Share

ఈ ఏడాది ‘దర్బార్‌’తో ప్రేక్షకులను పలకరించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఖుష్బూ, నయనతార, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్లు భాగం అయ్యారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌‌కు మంచి క్రేజ్ ఏర్పడగా.. తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త కోలీవుడ్‌ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ మూవీలో విలన్‌ పాత్ర కోసం టాలీవుడ్ ఫేమస్ హీరో గోపిచంద్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిపారని.. రజనీ సినిమాలో నటించేందుకు గోపిచంద్ ఒప్పుకున్నారని తెలుస్తోంది.

కాగా తొలి వలుపు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ ఆ తరువాత జయం(తమిళ రీమేక్‌లో కూడా), నిజం, వర్షం మూవీల్లో విలన్‌గా నటించారు. ఈ చిత్రాల్లో గోపిచంద్ విలనిజంను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఇక ఆ తరువాత హీరోగా కంటిన్యూ అవుతూ వస్తోన్న గోపిచంద్.. ఇటీవల వరుస ఫ్లాప్‌లో కాస్త డీలా పడ్డారు. ప్రస్తుతం సిటీ మార్‌ సినిమాలో నటిస్తుండగా.. దీంతో పాటు తేజ దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఇక అన్నాత్తే సినిమాను తెరకెక్కిస్తోన్న శివకు గోపిచంద్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. దర్శకుడిగా మారినప్పుడు మొదటి రెండు సినిమాలు(శౌర్యం, శంఖం) గోపిచంద్‌తోనే తీశారు శివ. ఈ సాన్నిహిత్యంతోనే దర్శకుడు శివ, రజనీకాంత్‌ కోసం గోపిచంద్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో నటించేందుకు గోపిచంద్ ఓకే చెప్తే.. ప్రాజెక్ట్‌కు మరో ఆకర్షణగా మారడంతో పాటు.. మళ్లీ ఆయన విలనిజాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు వస్తుంది. Read This Story Also: బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..