ముంబై:ప్రస్తుతం బయోపిక్స్ సినిమాల పరంగా, పాలిటిక్స్ పరంగా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలువురు సినిమా తారలు, స్పోర్ట్స్ పర్సన్స్, పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. అదే కోవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం కథాంశంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన సినిమా ‘పీఎం నరేంద్ర మోదీ’. ఏప్రిల్ 12వ తేదీన ఈ బయోపిక్ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌లో మోదీ గెటప్‌లో వివేక్ ఒబేరాయ్ అదరగొట్టాడు. మేరీ కోమ్, సరబ్‌జిత్ వంటి వారి బయోపిక్‌లను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్న ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కథా నాయకుడు దామోదర్‌దాస్ మోదీ గుజరాత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి, 2014 ఎన్నికల్లో చారిత్రక విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వరకు కథాంశంగా ఉంటుందని దర్శకుడు ఒమంగ్ కుమార్ వెల్లడించారు. జనవరిలో గుజరాత్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో చివరిదశలో ఉంది. షూటింగ్‌లో ఎక్కువ భాగం ఉత్తరాఖండ్‌లోనే జరిగింది.
సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరినా వహబ్, బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా లాంటి నటులు ఈ చిత్రంలో యాక్ట్ చేశారు. ప్రతి ప్రధాని బయోపిక్ ఆడియెన్స్‌ను ఎంతవరకు రంజింపజేస్తుందో చూడాలి.