మా సినిమా విడుదలకు ముహూర్తం కుదరలేదు.. వాయిదాను కూడా వెరైటీగా వెల్లడించిన అశోకవనంలో అర్జున కల్యాణం టీం..

Vishwak Sen: మాస్‌ కథలతో పాటు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్‌సేన్‌.

మా సినిమా విడుదలకు ముహూర్తం కుదరలేదు.. వాయిదాను కూడా వెరైటీగా వెల్లడించిన అశోకవనంలో అర్జున కల్యాణం టీం..
Song

Updated on: Mar 02, 2022 | 4:12 PM

Vishwak Sen: మాస్‌ కథలతో పాటు వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్‌సేన్‌. 2017లో ‘వెళ్లిపోమాకే’ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ తో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ‘పాగల్‌’ సినిమాతో లవర్ బాయ్ గా ఆకట్టుకున్న విశ్వక్‌ సేన్ (Vishwak Sen) .. ప్రస్తుతం  అశోకవనంలో అర్జున కళ్యాణం (Ashoka vanamlo arjunakalyanam) అనే సినిమాలో నటిస్తున్నాడు. మొదటిసారి క్లాస్‌, కూల్‌ పాత్రలో విశ్వక్‌ నటిస్తున్నాడు. రుక్సర్ థిల్లాన్‌ కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వయసు పెరిగిపోతున్నా పెళ్లికాని ఓ యువకుడు పడే కష్టాలను ఫన్నీగా చూపించినట్లు ఈ సినిమా టీజర్లను చూస్తే అర్థమవుతోంది. కాగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట మార్చి 4 న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

జ్యోతిష్యులు తీర్మానించడంతో..

అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్ల విషయంలో మొదటి నుంచి విభిన్నంగా ముందుకు వెళుతోన్న చిత్ర బృందం మూవీ వాయిదా అలాగే వ్యవహరించింది. ఈ సందర్భంగా లగ్నపత్రికపై ‘ అల్లం అర్జున్‌ కుమార్‌ జాతక రీత్యా మార్చి 4వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఇట్లు అల్లం వారి పెళ్లి బృందం’ అని రాసి ఉన్న కార్డును షేర్‌ చేసింది. కాగా ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. జై క్రిష్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎడిటర్గా విప్లవ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా ప్రవల్య దుడ్డిపూడి వ్యవహరిస్తున్నారు.

Also Read:ఫోన్ తో పరిచయం.. లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం.. అంతే కాకుండా ఇంకేం చేశాడంటే

Hyderabad: చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్

Hyderabad: చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్