శ్రీలంకన్ లెజెండ్ బయోపిక్‌లో ‘సైరా’ స్టార్!

తెలుగు నుంచి హిందీ వరకు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పొలిటికల్ లీడర్ల దగ్గర నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు అందరి బయోపిక్‌లను తెరకెక్కించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాను […]

శ్రీలంకన్ లెజెండ్ బయోపిక్‌లో 'సైరా' స్టార్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 24, 2019 | 4:40 PM

తెలుగు నుంచి హిందీ వరకు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పొలిటికల్ లీడర్ల దగ్గర నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు అందరి బయోపిక్‌లను తెరకెక్కించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983 వరల్డ్‌కప్ హీరో కపిల్ దేవ్ బయోపిక్ ’83’ టైటిల్ పేరిట రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోనే శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది.

అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో కాదు.. కోలీవుడ్‌లో రూపొందనుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. మురళీధరన్ అతని టెస్ట్ కెరీర్‌లో 800 వికెట్లు పడగొట్టాడు. దీని ఆధారంగానే టైటిల్‌ను ఖరారు చేశారట. డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో మిగిలిన తారాగణం ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.