Ranabaali : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న కోబలి పాట.. ఒక్క పాటతో రికార్డులు తిరగరాసిన విజయ్ దేవరకొండ..
రణబాలి.. ఇప్పుడు తెలుగు అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకున్న ఈ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఓవైపు ఇప్పటికే ఏందయ్యా సామీ సాంగ్ సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను నుంచి విడుదలైన కోబలి సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. కొన్నాళ్ల క్రితం విడుదలైన ఏందయ్యా సామీ సాంగ్, ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన రెండో పాట కోబలి ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘ఏందయ్యా సామి’ ఎంతగానో ఆకట్టుకోగా, ఇప్పుడు వచ్చిన కోబలి సాంగ్ మాస్ ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట హై-వోల్టేజ్ డివోషనల్ యాక్షన్ నంబర్‌గా నిలిచింది. వి.ఎమ్. మహాలింగమ్ శక్తివంతమైన గాత్రం, కేశవాదిత్య రాసిన ఉద్వేగభరితమైన సాహిత్యానికి తోడు అజయ్-అతుల్ ఇచ్చిన బీట్స్ వింటుంటే శ్రోతలకు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉజ్జ్వలమైన అనుభూతిని అందిస్తున్నాయి.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
ఈ పాటలో విజయ్ దేవరకొండ మేకోవర్, ఆయన చూపించిన రౌద్ర రసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒంటినిండా భస్మం, మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో కత్తి-త్రిశూలం ధరించి ఆయన చేసిన నృత్యం ఉగ్ర నరసింహుడిని, కాలభైరవుడి రుద్రతాండవాన్ని తలపిస్తోంది. విజయ్ బాడీ లాంగ్వేజ్, ఆరితేరిన హావభావాలు, గెటప్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికెత్తేశాయి. విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ పాట 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రీల్స్, షార్ట్స్ రూపంలో ‘కోబలి’ హవానే కనిపిస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే మైలురాయిగా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
కోబలి సాంగ్..
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
