Kushi Twitter Review: సీతారామమ్ తర్వాత మళ్లీ ఇదే.. ఖుషీ ట్విట్టర్‌ టాక్‌ ఎలా ఉందంటే

| Edited By: Ravi Kiran

Sep 01, 2023 | 1:20 PM

శివ నిర్వాణ దర్శకత్వంలో అంతకుముందు వచ్చిన నిన్ను కోరి, మజిలీ చిత్రాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాల్లోనూ దర్శకుడు ప్రేమ కథను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ క్రమంలోనే ఖుషీ చిత్రాన్ని సైతం అలాంటి ఓ వైవిధ్యభరితమైన కథాంశతోనే తెరకెక్కించారు....

Kushi Twitter Review: సీతారామమ్ తర్వాత మళ్లీ ఇదే.. ఖుషీ ట్విట్టర్‌ టాక్‌ ఎలా ఉందంటే
Kushi Movie Twitter Review
Follow us on

విజయ్‌ దేవరకొండ, సమంత జోడిగా తెరకెక్కిన నచిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు మేకర్స్‌. అటు సమంతతో పాటు, ఇటు విజయ్‌ దేవరకొండకు కూడా ఈ సినిమా ఎంతో కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరూ వరుస ఫ్లాప్‌లతో ఉన్న సమయంలో వచ్చిన ఖుషీ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు చిత్రంపై అమాంతం అంచనాలు పెంచేశాయి. పెళ్లి తర్వాత జంటల మధ్య వచ్చే భావోద్వేగాలను ఇతిహాసంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శివా నిర్వాణ. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.? సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌ వేదికగా ఎలాంటి అంశాలను పంచుకుంటున్నారు.? లాంటి వివరాలు తెలియాలంటే ట్విట్టర్‌ రివ్యూపై ఓ లుక్కేయాల్సిందే..

శివ నిర్వాణ దర్శకత్వంలో అంతకుముందు వచ్చిన నిన్ను కోరి, మజిలీ చిత్రాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాల్లోనూ దర్శకుడు ప్రేమ కథను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ క్రమంలోనే ఖుషీ చిత్రాన్ని సైతం అలాంటి ఓ వైవిధ్యభరితమైన కథాంశతోనే తెరకెక్కించారు. పెళ్లి తర్వాత జంటల మధ్య తలెత్తే చిన్న చిన్న చిన్న గొడవలు, వారి మధ్య ఉండే ఎమోషనల్‌ బాండింగ్స్‌ను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

ఖుషీ ట్విట్టర్ రివ్యూ..

ఇక ఇప్పటికే అమెరికాతో పాటు ఇతర చోట్ల సినిమాను వీక్షించిన ఆడియన్స్‌ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఖుషీ సినిమా ఒక ఎమోషనల్‌ జర్నీ అయినప్పటకీ కామెడీ బాగా వర్కౌట్‌ అయిందన్నారు. ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో సినిమాలో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని ట్వీట్‌ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో పాటు సామ్‌, విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌ అంటూ చెప్పుకొచ్చారు.

హిట్ కొట్టేశాం..

ఇక మరో యూజర్‌ స్పందిస్తూ.. సీతారామమ్‌ తర్వాత అలాంటి మరో గొప్ప ప్రేమ కథను చూడడం ఇదే తొలిసారి అని ట్వీట్ చేశారు. చాలా ప్యూర్‌, నీట్‌గా సినిమాను మరో లెవల్‌లో తెరకెక్కించారని దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత నటనకు సైతం ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సెకాండ్‌లో వచ్చే కొన్ని ఎమోషన్‌ సీన్స్‌ ప్రతీ ఒక్కరినీ కదలిస్తాయని చెబుతున్నారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చేప్పుడు కచ్చితంగా ఎమోషన్‌తో బయటకు వస్తారని ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఖుషీ మూవీ పాజిటివ్‌ బజ్‌ సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా రోజుల నుంచి సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతోన్న సామ్‌, విజయ్‌లకు ఈ సినిమా బూస్ట్‌నిస్తుందని చెప్పొచ్చు.

ఖుషీ అద్భుతమైన కథ..

సామ్, విజయ్ లు అదరగొట్టేశారు..

సీతారామమ్ తర్వాత మళ్లీ ఖుషీనే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..