‘అర్జున్ రెడ్డి’ని మించి ఎదగాలి: విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి.. ఈ సినిమాకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తెలుగునాట సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు హీరోగా విజయ్ దేవరకొండకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్.. ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మీ గోల్స్ ఏంటి అన్న ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.. ‘‘అర్జున్ రెడ్డి అంటే నేను సిగ్గుపడే స్థాయిని చేరుకోవాలి. ఇంకొన్ని ఏళ్లు గడిచిన తర్వాత కూడా నా […]

‘అర్జున్ రెడ్డి’ని మించి ఎదగాలి: విజయ్ దేవరకొండ
TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2019 | 11:57 AM

అర్జున్ రెడ్డి.. ఈ సినిమాకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తెలుగునాట సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు హీరోగా విజయ్ దేవరకొండకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్.. ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నటుడిగా మీ గోల్స్ ఏంటి అన్న ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.. ‘‘అర్జున్ రెడ్డి అంటే నేను సిగ్గుపడే స్థాయిని చేరుకోవాలి. ఇంకొన్ని ఏళ్లు గడిచిన తర్వాత కూడా నా ఉత్తమ చిత్రం అర్జున్ రెడ్డి అని చెప్పుకుంటే దానర్థం నటుడిగా నేను ఎదిగినట్లు కాదు. అందుకే నటుడిగా ఆ సినిమాను మించి ఎదగాలని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ఇక డియర్ కామ్రేడ్ గురించి మాట్లాడుతూ.. అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని, కచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu