సిక్స్‌ప్యాక్‌యే… కాని ఫేక్!

కోడంబాక్కం: విజయ్ ఆంటోని…తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ నటుడు. మ్యూజిక్ డైరక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారి తనకంటూ టిపికల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా చెరగని చిరునవ్వుతో సమాధానం ఇస్తూ వెళ్తూ..ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తతం మ్యూజిక్ చేయడానికి కూడా తీరిక లేనంతగా…బిజీ షెడ్యూల్స్‌తో షూటింగ్ జరుపుకుంటున్నాడు. అయితే తాజాగా ‘ఖాకీ’చిత్రంలో నటిస్తున్న విజయ్ ఆ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారట. అయితే […]

సిక్స్‌ప్యాక్‌యే... కాని ఫేక్!
Follow us

|

Updated on: Mar 15, 2019 | 12:19 PM

కోడంబాక్కం: విజయ్ ఆంటోని…తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ నటుడు. మ్యూజిక్ డైరక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారి తనకంటూ టిపికల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా చెరగని చిరునవ్వుతో సమాధానం ఇస్తూ వెళ్తూ..ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తతం మ్యూజిక్ చేయడానికి కూడా తీరిక లేనంతగా…బిజీ షెడ్యూల్స్‌తో షూటింగ్ జరుపుకుంటున్నాడు. అయితే తాజాగా ‘ఖాకీ’చిత్రంలో నటిస్తున్న విజయ్ ఆ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారట. అయితే అది నిజమైన సిక్స్ ఫ్యాక్ కాదు…గ్రాపిక్స్ అంట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ యాంటోనినే కన్ఫార్మ్ చేశాడు .అసలు సిక్స్‌ప్యాక్‌ చేసేంత సమయం లేదని…. ఒకవేళ అది తప్పనిసరి అయితే శ్రమించి నిజంగానే ఆరు పలకల దేహం సాధిస్తానని చెప్తున్నాడు. మరి ఆ విఎఫ్ఎక్స్ సిక్స్ ప్యాక్ ఎలా ఉంటుందో తెలియాలంటే చిత్రం విడుదల వరకు వెయిట్ చేయల్సిందే.