సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ లెజెండరీ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ (Sandhya Mukherjee) మృతి చెందారు. 90 ఏళ్ల సంధ్యా ముఖర్జీ గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం అనారోగ్యంతో విషయమించడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు..
గత నెలలో కోవిడ్ స్వల్ప లక్షణాలతో సంధ్యా ముఖర్జీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. సంధ్యా ముఖర్జీ.. ఎస్ డీ. బర్మన్, నౌషద్, సలీల్ చౌదరి వంటి ప్రముఖుల దర్శకత్వంలో హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఆకట్టుకున్నారు. సంధ్యా ముఖర్జీ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంతాపం ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ శ్రీ అవార్డును సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. 90 ఏళ్ల వయసులో తనలాంటి దగ్గజ గాయనికి పద్మ శ్రీని ప్రధానం చేయడం చాలా అవమానకరం అని అందుకే తన తల్లి సంధ్యా ముఖర్జీ అవార్డును తిరస్కరించిందని ఆమె కూతురు సౌమీ సేన్ గుప్తా వెల్లడించిన సంగతి తెలిసిందే.
సంధ్యా ముఖర్జీ 2011లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కామైన బంగాబిభూషణ్ అవార్డు అందుకున్నారు. హాలీవుడ్ క్లాసిక్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రం.. బెంగాలి రీమేక్ అయిన జై జయింతి కోసం 1970లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. 60-70లలో ప్లేబ్యాక్ సింగర్ గా ఎన్నో మధురమైన పాటలను ఆలపించారు. బెంగాలీలో వేలాది పాటలు.. 12 భాషల్లో పాటలు పాడి అభిమానులను అలరించారు. సంధ్య ముఖర్జీ మృతిపై ప్రధాని నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు.
The passing away of Gitashree Sandhya Mukhopadhyay Ji leaves us all extremely saddened. Our cultural world is a lot poorer. Her melodious renditions will continue to enthral the coming generations. My thoughts are with her family and admirers in this sad hour. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 15, 2022
Also Read: Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..
Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు
Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన కళావతి పాట..