Leelavathi: 600కు పైగా సినిమాలు.. పేదలకు నెల నెలా డబ్బులు.. ప్రముఖ నటి అస్తమయంతో విషాదంలో ఇండస్ట్రీ

|

Dec 08, 2023 | 8:46 PM

సుమలత, శివరాజ్‌కుమార్, గీతా శివరాజ్‌కుమార్, దర్శన్, అభిషేక్ అంబరీష్, అర్జున్ సర్జా, డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు లీలావతి మరణంపై సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినిమాలతోనే కాదు సామాజిక సేవతోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు లీలావతి

Leelavathi: 600కు పైగా సినిమాలు.. పేదలకు నెల నెలా డబ్బులు.. ప్రముఖ నటి అస్తమయంతో విషాదంలో ఇండస్ట్రీ
Actress Leelavathi
Follow us on

 

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి లీలావతి కన్ను మూశారు.. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం (డిసెంబర్‌ 8) తుదిశ్వాస విడిచారు. 86 ఏళ్ల లీలావతి సుమారు 50 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకు సేవలందించారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ వంటి దిగ్గజ నటులతో నటించి మెప్పించారు. కన్నడతో సహా తెలుగు, తమిళ భాషల్లో మొత్తం 600లకు పైగా చిత్రాల్లో నటించారు లీలావతి. ఆమె మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుమలత, శివరాజ్‌కుమార్, గీతా శివరాజ్‌కుమార్, దర్శన్, అభిషేక్ అంబరీష్, అర్జున్ సర్జా, డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు లీలావతి మరణంపై సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినిమాలతోనే కాదు సామాజిక సేవతోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు లీలావతి. 2022 లో తన సొంత ఖర్చుతో సోలదేవనహళ్లిలో ఆసుపత్రిని నిర్మించారామె. అంతే కాదు పేద కళాకారులకు కూడా సాయం చేశారు. ‘కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులకు నటి లీలావతి ప్రతినెలా డబ్బు ఇస్తోంది. దీంతో కష్టాల్లో ఉన్న కళాకారులకు సాయం అందుతోంది. మేం ముఖానకి మేకప్‌ వేసుకుంటనే పూట గడుస్తుంది. అయితే కరోనా తర్వాత మాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా మంది కళాకారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నటి లీలావతి మాకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు’ అని లీలావతి సాయం పొందిన కళాకారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

లీలావతి 1937 డిసెంబర్ 24న జన్మించారు. ఆమె స్వస్థలం మంగళూరు. లీలావతి అత్యంత పేదరికంలో పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని ఆమె కుటుంబ సభ్యులు వివక్ష చూపించారు. దీంతో లీలావతి 2వ తరగతి వరకు మాత్రమే చదివింది. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లలేకయింది. తర్వాత తన ఇంట్లో పని చేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆపై నటనలో ఓనమాలు నేర్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దిగ్గజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మదువే మదినోడు’, ‘శాంత తుకారాం’ చిత్రాలకు లీలావతి 2 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ‘తుంబిడా కొడ’, ‘మహాత్యాగ’, ‘భక్త కుంబర’, ‘సిపై రాము’, ‘గెజ్జె పూజ’ సినిమాల్లో నటనకు గాను రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ‘కన్నడ కాండ’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. 1999లో లీలావతికి ‘డా. రాజ్‌కుమార్ అవార్డు’. 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

సుమలత సంతాపం..

సీఎం సిద్ధరామయ్య నివాళి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.