Viral: నాగచైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్‌పై స్పందించిన వేణుస్వామి భార్య.. ఏమన్నారంటే..

ఇదంతా ఇలా ఉంటే నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే వేణుస్వామి మరోసారి తెరమీదికి వచ్చారు. మొన్నటి మొన్న ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలను చెప్పనని తేల్చి చెప్పిన వేణుస్వామి.. మరోసారి నాగచైతన్యపై స్పందించారు. చైతూ-శోభితల జాతకాన్ని వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. వీరిద్దరు ఎక్కువగా కాలం కలిసి ఉండరని...

Viral: నాగచైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్‌పై స్పందించిన వేణుస్వామి భార్య.. ఏమన్నారంటే..
Venu Swamy Wife
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2024 | 4:54 PM

నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగినట్లు నాగార్జున స్వయంగా ప్రకటించారు. ఈ జంట సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాగ్‌ సోషల్‌ మీడియాలో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. కాగా వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. నాగచైతన్య కొత్త జీవితం ప్రారంభిస్తుండడంపై ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇదంతా ఇలా ఉంటే నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే వేణుస్వామి మరోసారి తెరమీదికి వచ్చారు. మొన్నటి మొన్న ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలను చెప్పనని తేల్చి చెప్పిన వేణుస్వామి.. మరోసారి నాగచైతన్యపై స్పందించారు. చైతూ-శోభితల జాతకాన్ని వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. వీరిద్దరు ఎక్కువగా కాలం కలిసి ఉండరని, ఓ అమ్మాయి కారణంగా ఈ జంట విడిపోతుందని. అది కూడా 2027లో విడాకులు అవుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

దీంతో వేణుస్వామిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. అటు చైతన్య అభిమానులతో పాటు పలువురు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. చివరికి మా అధ్యక్షుడు మంచు విష్ణు తనకు కాల్‌ చేశారని, ఇకపై మళ్లీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి జ్యోతిష్యాలను చెప్పనని మరో వీడియోను విడుదల చేశారు వేణుస్వామి. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇందులోనే వేణుస్వామి భార్య వీణ శ్రీవాణి తెరపైకి రావడం ఆశ్చర్యంగా ఉంది.

వీణ వాయిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీవాణి.. భర్త చెప్పే జ్యోతిష్యాలపై ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య-శోభితకు శుభాకాంక్షలు తెలిపారు. అంతటితోనే ఆగకుండా తనకు ఖరీదైన లువీస్‌ విట్టన్‌ కంపెనీకి చెందిన హ్యాండ్‌ బ్యాగ్‌ గిఫ్ట్‌గా ఇవ్వాలని వీడియోలో పేర్కొన్నారు. అయితే.. మీరు (చై-శోభిత) ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే సోకాల్డ్ యోధులు వేరే వాళ్లను టార్గెట్ చేసుకొని మీ టాపిక్‌ను డైవర్ట్‌ చేయడం ఏంటి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడే చర్చకు దారి తీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఓవైపు మీ భర్త వాళ్లు వీడిపోతారని అంటుంటే, మరోవైపు మీరు కాంగ్రాట్స్‌ చెప్పడం ఏంటి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..