Telugu News Entertainment Valentine day These are the evergreen love song from tollywood Telugu Filmy News
Valentine’s Day: ‘ప్రియతమా నీవచట కుశలమా.. నేను ఇచట కుశలమే’.. ఈ ప్రేమ కావ్యాలు ఎప్పటికీ మధురమే.
ప్రేమ ఓ మధురమైన భావన. మాటలకు అందని అపురూపమైంది ప్రేమ. అక్షరాలకు అందనిది ప్రేమ. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు. ప్రేమ గురించి ఎంత వర్ణించినా తక్కువే. మాటలకు అందని ప్రేమను పాటల రూపంలో వెండి తెరపై ఆవిష్కరించారు..
ప్రేమ ఓ మధురమైన భావన. మాటలకు అందని అపురూపమైంది ప్రేమ. అక్షరాలకు అందనిది ప్రేమ. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు. ప్రేమ గురించి ఎంత వర్ణించినా తక్కువే. మాటలకు అందని ప్రేమను పాటల రూపంలో వెండి తెరపై ఆవిష్కరించారు ఎంతో మంది రచయితలు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి కొన్ని మధు ప్రేమ కావ్యాలపై ఓ లుక్కేయండి..
ఎప్పటికీ నిలిచిపోయే మధుర ప్రేమ గీతాల్లో క్రిమినల్ మూవీలోని ‘తెలుసా మనసా’ సాంగ్ ఒకటి. నాగార్జున, మనిషా కొయిరాలల మధ్య తెరకెక్కించిన ఈ పాటను ఎస్‌పీ బాలసుబ్రమణ్యం అద్భుతంగా ఆలపించారు.
స్వయంవరం సినిమాలోని కీరవాణి రాగంలో పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ ఉండే ఈ పాట ఎప్పటికీ మధురమే.
లవ్ సాంగ్స్‌లో గులాబీ మూవీలోని ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు సాంగ్ ఎవర్‌గ్రీన్. సునీత అద్భుత గాత్రం ఈ పాటను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది.
గులాబీ చిత్రంలోని మరో పాట ‘ఏ రోజు అయితే చూశానో నిన్ను’ పాటకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ చాలా మంది ఈ పాటను రింగ్ టోన్‌గా పెట్టుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
నిన్నే పెళ్లాడుతా సినిమాలోని ‘కన్నుల్లో నీ రూపమే’ సాంగ్ ఎప్పటికీ మధురమే.
సుమంత్, జెనిలీయా జంటగా తెరకెక్కిన సత్యం మూవీలోని ‘ఐయామ్ ఇన్ లవ్’.
ఒకే ఒక్కడు మూవీలోని నెల్లూరి నెరజానా పాట ఎవర్‌గ్రీన్.