AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena First Single: సంగీత ‘ఉప్పెన’ షురూ.. మొదటి పాట ఎప్పుడంటే..!

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. లెక్కల మాష్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Uppena First Single: సంగీత 'ఉప్పెన' షురూ.. మొదటి పాట ఎప్పుడంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 7:48 PM

Share

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. లెక్కల మాష్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఒక్కో పాటను విడుదల చేయబోతోంది. ఈ క్రమంలో ‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ సాగే మొదటి పాట మార్చి 2న సాయంత్రం గం.4.05ని.లకు విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ప్రేమ కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌కు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేమ పాటలను ఇవ్వడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న డీఎస్పీ.. ‘ఉప్పెన’కు అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారని తెలుస్తోంది. ఏదేమైనా దేవీ ఇచ్చిన సంగీత ఉప్పెనలో మునిగి తేలాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.