Chiru in Lucifer Remake: ‘లూసిఫర్’ రీమేక్‌.. లైన్‌లోకి ‘మెగాస్టార్’ ఫేవరెట్ డైరక్టర్..!

మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్‌ను తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. చిరుతో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తొలుత సుకుమార్ పేరు వినిపించింది

Chiru in Lucifer Remake: 'లూసిఫర్' రీమేక్‌.. లైన్‌లోకి 'మెగాస్టార్' ఫేవరెట్ డైరక్టర్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 28, 2020 | 4:50 PM

Chiru in Lucifer Remake: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. చిరుతో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తొలుత సుకుమార్ పేరు వినిపించింది. కానీ రీమేక్‌లపై అంత ఆసక్తిని చూపని సుకుమార్.. ఈ ప్రాజెక్ట్‌ను చేయలేనని రామ్ చరణ్‌కు చెప్పారట. కావాలంటే ఇంకో కథను రెడీ చేస్తానని అన్నారట. ఇక ఆ తరువాత పరశురామ్ పేరు వినిపించింది. ఇక పరశురామ్ కూడా మహేష్‌తో సినిమాకు రెడీ అవుతోన్న సమయంలో ఇప్పుడు మరో స్టార్ దర్శకుడి పేరు ఫిలింనగర్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనెవరంటే.. వివి వినాయక్.

మెగాస్టార్‌తో వినాయక్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఠాగూర్‌ సినిమా కోసం వీరిద్దరు మొదటిసారిగా కలిసి పనిచేశారు. ఇక అప్పటినుంచే చిరుకు వినాయక్‌పై నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే రీఎంట్రీ సమయంలో ఎంతోమంది స్టార్ దర్శకులు ఉన్నా.. వినాయక్‌నే ఎంచుకున్నారు మెగాస్టార్. ఇక ఇప్పుడు లూసిఫర్ రీమేక్‌కు ఆయనే న్యాయం చేయగలడని చిరు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంటలిజెంట్ ఫ్లాప్‌ తరువాత దర్శకత్వానికి దూరమయ్యారు వినాయక్. ఈ క్రమంలో హీరోగా సీనయ్య అనే మూవీలో నటించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా వచ్చేందుకు ఆయన ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరు, వినాయక్‌ను పిలిచి లూసిఫర్ రీమేక్‌పై సంప్రదింపులు జరిపినట్లు టాక్. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు వినాయక్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే చిరు-వినాయక్‌ కాంబోలో హాట్రిక్ సినిమా తెరకెక్కడం ఖాయం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. Read This Story Also: మెగా హీరోలను చెర్రీ ఎందుకు వద్దనుకున్నాడు..!

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?