Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • మూడో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. నాలుగు బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి. 15రోజుల పాటు అర్ధరాత్రి వేళ శిధిలాల తరలింపు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
  • యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో అరెస్ట్. కొద్ది రోజుల క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబే గ్యాంగ్. వికాస్ దూబే కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గాలింపు. వరుసగా అనుచరుల ఎన్‌కౌంటర్, తాజాగా వికాస్ అరెస్ట్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్ నడపండి. నిన్న గోపాల్‌పురంలో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ జారిపడి తలకు గాయమైంది.. తరువాత ఆసుపత్రిలో మరణించాడు. బహుశా అతను హెల్మెట్ ధరించి ఉంటే బ్రతికి ఉండేవాడు.. హెల్మెట్ మీ భద్రత కోసం.. పోలీసుల తనిఖీ కోసం కాదు. బైక్ పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయండి.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

Chiru 152: మెగా హీరోలను చెర్రీ ఎందుకు వద్దనుకున్నాడు..!

తమ ఫ్యామిలీ గురించి బయట పుకార్లు చేసేవాళ్లు తమకు వెంట్రుకతో సమానం అంటూ ఆ మధ్యన మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎవరెన్నీ అనుకున్నా.. తమ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉంటుందని చెర్రీతో పాటు మెగా హీరోలు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
Mahesh in Chiranjeevi movie, Chiru 152: మెగా హీరోలను చెర్రీ ఎందుకు వద్దనుకున్నాడు..!

తమ ఫ్యామిలీ గురించి బయట పుకార్లు చేసేవాళ్లు తమకు వెంట్రుకతో సమానం అంటూ ఆ మధ్యన మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎవరెన్నీ అనుకున్నా.. తమ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి ఉంటుందని చెర్రీతో పాటు మెగా హీరోలు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కలిసి ఫోజు ఇచ్చిన ఫొటోలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఫ్యామిలీ రిలేషన్‌ను పక్కనపెడితే.. సినిమాల విషయంలో మెగా హీరోలపై చెర్రీ అభిప్రాయమేంటన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక అసలు విషయంలోకి వస్తే.. కొరటాల దర్శకత్వంలో చిరు(Chiranjeevi) నటిస్తోన్న 152వ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్(Ram Charan) నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కూడా రామ్ చరణ్ నటించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఆ పాత్రలో మహేష్‌బాబు(Mahesh Babu) నటించనున్నారని.. దానికి సంబంధించి 30రోజుల డేట్లు కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే చిరు సినిమాలో ఓ చిన్న పాత్రలోనైనా నటించేందుకు మెగా హీరోలందరూ ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్(Allu Arjun), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), వరుణ్ తేజ్‌(Varun Tej)లు చాలా సార్లే చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ అవకాశం ఉంది. కావాలనుకుంటే కొరటాల సినిమాలో కీలక పాత్ర కోసం మెగా హీరోలనే సంప్రదించొచ్చు. మిగిలిన సినిమాల షూటింగ్‌ల్లో ఎంత బిజీగా ఉన్నా.. చిరు సినిమాలో పాత్ర అంటే వారు వద్దనే అవకాశం ఉండకపోవచ్చు. అంతేనా పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా రీ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి.. ఈ చిత్రంలో పవన్ నటిస్తే.. ఆ ప్రాజెక్ట్‌కు భారీ క్రేజ్ కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా చరణ్, మహేష్‌ను ఎంచుకోవడానికి కారణమేంటన్న చర్చ జరుగుతోంది.

అయితే చరణ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ కారణమున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు మహేష్ అదనపు ఆకర్షణ అవ్వడంతో పాటు.. ఇరు ఫ్యాన్స్‌ల మధ్య సయోధ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా తామంతా ఒకేటనని ప్రేక్షకులకు చెప్పొచ్చు. అలాగే మార్కెట్ పరంగానూ ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ ఆలోచించిన చెర్రీ.. మహేష్‌‌వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇక కొరటాలకు మహేష్‌తో మంచి సాన్నిహిత్యం ఉండటంతో.. ఇందులో నటించేందుకు సూపర్‌స్టార్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చిరు సినిమాలో మహేష్ నటించడంపై అధికారిక ప్రకటన వస్తే.. టాలీవుడ్‌లో ఇదో క్రేజీ మల్టీస్టారర్‌గా నిలవడం ఖాయం.

Read This Story Also: చిరు మూవీలో మహేష్.. చెర్రీ తప్పుకోవడం వెనుక కారణామిదేనా..!

Related Tags