క్రేజీ ఆఫర్‌ని వదులుకున్న ‘ఉప్పెన’ దర్శకుడు.. 70లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామన్నా..!
అంతకుముందు లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఉప్పెనతో టాలీవుడ్‌కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
Buchibabu Sana Uppena: అంతకుముందు లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఉప్పెనతో టాలీవుడ్‌కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు దీన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కొత్త హీరో, హీరోయిన్(వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి) అయినప్పటికీ.. ఉప్పెన కోసం భారీ బడ్జెట్‌నే ఖర్చు చేశారు. ఇక ఫైనల్ రషెస్‌ని చూసిన వారికి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయట. అంతేకాదు ఈ మూవీలో నటించిన విజయ్ సేతుపతి.. ఫైనల్ ఔట్‌పుట్‌ని చూసి రీమేక్ హక్కులు కూడా తీసుకున్నట్లు టాక్ నడిచింది. (ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్‌కి అలవాటు పడ్డట్లున్నారు.. సినిమా పరిశ్రమ ఎటు పోతోందో తెలీడం లేదు)
ఇక కరోనా, లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ సినిమా థియేటర్‌లలోకి వచ్చి.. బుచ్చిబాబు స్టామినాను నిరూపించి ఉండేది. మరోవైపు సినిమాపై ఉన్న నమ్మకంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు మొగ్గుచూపడం లేదు. ఇదంతా పక్కనపెడితే ఈ మూవీ దర్శకుడు బుచ్చిబాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బుచ్చిబాబు ఓ క్రేజీ ఆఫర్‌ని వదులుకున్నారట. (అర్హ బర్త్‌డే వేడుకలు చేసిన పుష్ప నిర్మాతలు.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన బన్నీ)
ఈ దర్శకుడిని కలిసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. తదుపరి సినిమా కోసం 70 లక్షల అడ్వాన్స్ ఇస్తానని చెప్పిందట. అయితే వారి ఆఫర్‌ని ఈ దర్శకుడు సున్నితంగా ఉన్నారట. దానికి మరో కారణం ఉందట. మైత్రీ మూవీ మేకర్స్ కోసం మరో సినిమాకు కమిట్ అయ్యారట బుచ్చిబాబు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాకే మరో నిర్మాణ సంస్థలో పనిచేయాలనుకుంటున్నారట. దీంతో సితార ఆఫర్‌ని బుచ్చిబాబు వదులుకున్నట్లు సమాచారం. ఏదేమైనా మొదటి సినిమా విడుదల కాకుండానే బుచ్చిబాబుకు మాత్రం మంచి క్రేజ్ వస్తోంది. (వద్దన్న సుజీత్.. చేస్తానన్న వినాయక్.. మాస్ డైరక్టర్ ఖాతాలో మరో రీమేక్..!)