తరుణ్‌ని ప్రేమిస్తానని అనుకుందట.. అందుకే పెళ్లి చేసుకోమంది..

సినీ ఇండస్ట్రీలో నటీ, నటుల మధ్య ఎన్నో గొడవలు, గిల్లికజ్జాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి అనుభవం గురించి హీరోయిన్ ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వూలో వెల్లడించింది.

  • Publish Date - 6:06 pm, Sun, 22 November 20
తరుణ్‌ని ప్రేమిస్తానని అనుకుందట.. అందుకే పెళ్లి చేసుకోమంది..

సినీ ఇండస్ట్రీలో నటీ, నటుల మధ్య ఎన్నో గొడవలు, గిల్లికజ్జాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి అనుభవం గురించి హీరోయిన్ ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వూలో వెల్లడించింది. నవవసంతం సినిమా షూటింగ్‌లో హీరో తరుణ్, ప్రియమణి దగ్గరగా ఉండటం చూసిన తరుణ్ అమ్మగారు రోజా రమణి.. ఇష్టమైతే తరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని కోరిందట.. అయితే ఆ మాటలు తనను షాకింగ్‌కు గురిచేశాయని చెప్పుకొచ్చింది ప్రియమణి.

తరుణ్ మంచి నటుడని, అందరితో ఫ్రీ గా ఉండటం వల్ల తను కూడా క్లోజ్ అయ్యానని తెలిపింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని, అంతకు మించి ఏమి లేదని వెల్లడించింది. ఇద్దరం కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి చాలా సార్లు లంచ్, డిన్నర్ కూడా చేశామని, మేము కలిసి తిరగడం చూసిన జనాలు లవ్‌లో ఉన్నట్లుగా మాట్లాడుకునేవారని తెలిపింది. ఈ విషయం కాస్తా తరుణ్ అమ్మగారికి తెలిసి షూటింగ్‌లో ఓ రోజు తనతో ఈ విషయం గురించి అడిగిందని వెల్లడించింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసిందని నీ కిష్టమైతే తరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని అడిగిందని చెప్పింది ప్రియమణి. అయితే తరుణ్‌కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేని, తమని పూర్తిగా అపార్థం చేసుకున్నారని ఆమెతో చెప్పినట్లు వివరించింది. తెరపై ఇప్పటికీ మెరుస్తున్న ప్రియమణి 2017లో ముస్తాఫ్‌ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న నారప్ప మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.