Adipurush: ఆదిపురుష్‏లోని ఆ సీన్ రీక్రియేట్ చేసిన యూట్యూబర్.. వీడియో అదిరిపోయింది..

|

Nov 28, 2022 | 5:54 PM

ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలోని ఓ సీన్ రీక్రియేట్ చేసి అబ్బురపరిచాడు ఓ యూట్యూబర్. టీజర్ లో కనిపించిన ప్రభాస్ సముద్ర అడుగున ధ్యానం చేస్తున్న సీన్ రీక్రియేట్ చేసి అదుర్స్ అనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Adipurush: ఆదిపురుష్‏లోని ఆ సీన్ రీక్రియేట్ చేసిన యూట్యూబర్.. వీడియో అదిరిపోయింది..
Adipurush
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్‏తో డార్లింగ్ అభిమానులకు నిరాశకు గురయ్యారు. టీజర్‏లో వీఎఫ్ఎక్స్ పై.. సైఫ్, ప్రభాస్ లుక్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మూవీ టీజర్ పై.. డైరెక్టర్ ఓంరౌత్ పై నెట్టింట దారుణంగా ట్రోలింగ్స్ నడిచాయి. దీంతో సినిమా రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది చిత్రయూనిట్. పలు సన్నివేశాల్లో మార్పులు చేపట్టింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాను జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ తగ్గింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సీన్ రీక్రియేట్ చేసి అబ్బురపరిచాడు ఓ యూట్యూబర్. టీజర్ లో కనిపించిన ప్రభాస్ సముద్ర అడుగున ధ్యానం చేస్తున్న సీన్ రీక్రియేట్ చేసి అదుర్స్ అనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే అండర్ వాటర్ సీన్ తో ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ స్టార్ట్ అయింది. ఈ దృశ్యాన్ని ఈ యూట్యూబర్ సరిగ్గా 3డిలో పునఃసృష్టించారు. యూట్యూబర్ స్వయంగా 3డి స్కాన్ చేసి, బ్లెండర్‌లో సీన్ ను ఎలా సృష్టించాడో చూపించాడు. వీడియో చివరలో రీక్రియేట్ చేసిన సీన్ చూస్తే అది ఆదిపురుష్ టీజర్ లాగే కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరలవడమే కాకుండా.. ఆ యూట్యూబర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

రూ.’500 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆదిపురుష్ కంటే ఈ వీడియో చాలా అందంగా ఉందని.. ఈ మూవీ మొత్తం VFX యూనిట్ కంటే ఒక యూట్యూబర్ వర్క్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, సీతగా కృతి సనన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.