Raj Tarun: జీవితంలో పెళ్లి చేసుకోను.. పిల్లలు వద్దు.. రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్..

రాజ్ తరుణ్ కెరీర్ సాఫీగా సాగుతుందనుకున్నారు. కానీ ఆ తర్వాతే అతడి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నెమ్మదిగా హిట్స్ కంటే ఎక్కువగా ప్లాపులే పలకరించాయి. ఇక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. చాలా కాలం తర్వాత ఈ ఏడాది నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో కీలకపాత్రలో కనిపించాడు.

Raj Tarun: జీవితంలో పెళ్లి చేసుకోను.. పిల్లలు వద్దు.. రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్..
Raj Tarun
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:54 AM

షార్ట్స్ ఫిల్మ్స్ చేసిన కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతాయనుకున్నారు. అదే సమయంలో రాజ్ తరుణ్ నటించిన మరో రెండూ మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో రాజ్ తరుణ్ కెరీర్ సాఫీగా సాగుతుందనుకున్నారు. కానీ ఆ తర్వాతే అతడి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నెమ్మదిగా హిట్స్ కంటే ఎక్కువగా ప్లాపులే పలకరించాయి. ఇక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. చాలా కాలం తర్వాత ఈ ఏడాది నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో కీలకపాత్రలో కనిపించాడు.

ఆ సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తిరగబడరా సామీ, భలే ఉన్నాడే, పురుషోత్తముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

“జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోవద్దు అని డిసైడ్ అయ్యాను. నాకు పెళ్లి, పిల్లలు వద్దు. ఇప్పుడు సింగిల్ గా సంతోషంగా ఉన్నాను. పెళ్లి విషయంలో మా నాన్న నా ఇష్టం అంటున్నారు. అమ్మ మాత్రం మొదట్లో అడిగింది. కానీ ఇప్పుడు నా ఇష్టం అని వదిలేసింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పట్లో పెళ్లి అనే ఆలోచనలు మాత్రం లేవని తేల్చేశాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ వయసు 31 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఉయ్యాలా జంపాలా తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

View this post on Instagram

A post shared by Raj Tarun (@rajtarunn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..