Nikhil Siddharth: జోరు పెంచిన కుర్రహీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా నిఖిల్..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కుర్ర హీరో నిఖిల్. హ్యాపీడేస్ సినిమా తర్వాత నిఖిల్ సోలో హీరోగా ఎదుగుతూ వచ్చాడు.

Nikhil Siddharth: జోరు పెంచిన కుర్రహీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా నిఖిల్..
Nikhil

Edited By:

Updated on: Sep 19, 2021 | 7:24 PM

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కుర్ర హీరో నిఖిల్. హ్యాపీడేస్ సినిమా తర్వాత నిఖిల్ సోలో హీరోగా ఎదుగుతూ వచ్చాడు. కెరియర్ ప్రారంభంలో కథల విషయంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. స్వామిరారా సినిమా తర్వాత నిఖిల్ విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే చివరగా వచ్చిన అర్జున్ సురవరం సినిమా కూడా హిట్ అయింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన నిఖిల్.. ఆయా సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం నిఖిల్ సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. 18పేజెస్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం 18 పేజెస్ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందింది. అలాగే ఈ సినిమాతోపాటు కార్తికేయ మూవీకి సీక్వెల్ చేస్తున్నాడు నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ‘కార్తికేయ 2’ కథ ‘ద్వాపరయుగం’నాటి ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంగా నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తికి పెంచింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ టాలెంటెడ్ హీరోయిన్…

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..