Kiran Abbavaram: ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం..

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు, అజాత‌శత్రువు అయిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో కార్తిక్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ..

Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని' అంటున్న కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 23, 2022 | 7:05 PM

Kiran Abbavaram: శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు, అజాత‌శత్రువు అయిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో కార్తిక్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సూప‌ర్‌హిట్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల ‌హృద‌యాల్లో కుటుంబ‌స‌భ్యుడిగా పేరు సంపాదించుకున్న‌ కిరణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ద‌ర్శ‌క లెజెండ్ కోడి రామ‌కృష్ణ గారు సమ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. కోడి రామ‌కృష్ణ  చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియాటర్ కి పిక్నిక్ గా వెళ్ళి చూసేవారు. ఇప్ప‌టికీ టీవిలో ఆయ‌న చిత్రాలు వ‌స్తున్నాయంటే ఫ్యామిలీ అంతా కూర్చిని చూస్తుంటారు. అలా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఆయ‌న బాగా కావాల్సిన‌వాడిగా.. వారి కుటుంబ‌సభ్యుడిగా మారిపోయారు. అలాంటి తెలుగు ద‌ర్శ‌కుడి పెద్ద కుమార్తె దివ్య దీప్తి, అలాగే మంచి చిత్రాలు చేస్తూ ప్ర‌తి ప్రేక్ష‌కుడికి బాగా కావాల్సిన వాడిలా కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌లిసిపోవ‌డం, ఈ చిత్ర కథ కూడా అన్ని ఎమోష‌న్స్ తో రావ‌డంతో ఈ చిత్రానికి నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. కోడి రామ‌కృష్ణ గారి దివ్య ఆశిస్సుల‌‌తో టైటిల్ ని తాజాగాఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంభందించిన మొద‌టి లుక్ ని కూడా విడుదల చేశారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ల‌వ‌ర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్ష‌కులు ఒకే సారిగా మాస్ క‌మ‌ర్షియ‌ల్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. టాలీవుడ్ లో వున్న క‌మ‌ర్షియ‌ల్ హీరోల స‌ర‌స‌న చేరేలా ఈ లుక్ వుండ‌టం విశేషం. ఈ సినిమాకి సంబందించిన ఎక్సైట్‌మెంట్ న్యూస్ మ‌రి కొన్ని రొజుల్లో తెలియజేయనున్నారు.

Kiran

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda : న్యూ లుక్ తో కేక పుట్టిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Santosh Shoban : సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కుర్ర హీరో.. సంతోష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!