18 ఏళ్లకి పెళ్లి.. 20 ఏళ్లకి తల్లి.. అధిక పారితోషకం.. ఎవరా హీరోయిన్.?

Prudvi Battula 

20 February 2025

సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై దేశంలోనే అత్యంత అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటి ఎవరో. మీరు విన్నది నిజమే.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలన్నింటిలోనూ ఆ నటి  అత్యదిక పారితోషికం తీసుకుంటుంది. ఆమెకు ఎంత ఇవ్వటకైన సిద్ధం అంటున్నారు నిర్మాతలు.

ఆమె మరెవరో కాదు.. సీరియల్ నటి శ్వేతా తివారి. హిందీలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సీరియల్ ‘కసౌటి జిందగీ కె’లో ప్రేరణ శర్మ అనే ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్మాల్ స్క్రీన్ పై ఈ సీరియల్ దాదాపు ఏడేళ్లపాటు సక్సెస్ ఫుల్ గా సాగింది.

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. అందులో విజేతగా నిలవడంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చేసింది.

ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. సినిమాల్లో కాకుండా కేవలం సీరియల్స్, టీవీ షోల ద్వారానే పాపులర్ అయ్యింది శ్వేతా.

అయితే రంగుల జీవితం ఎంతో విజయవంతంగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండుసార్లు ప్రేమలో మోసపోయింది.

శ్వేతా తివారి 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారి జన్మించింది. మనస్పర్థల కారణంగా 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించారు. తన భర్త గృహ హింసకు పాల్పడుతున్నడాని 2019లో కోర్టును ఆశ్రయించగా.. అదే ఏడాది విడాకులు తీసుకున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం ప్రముఖ సీరియల్ నటి శ్వేతా తివారి తివారీ ఆస్తులు రూ.81 కోట్లు ఉన్నాయని సమాచారం.