సమంత ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆ ఫొటోనే!
20 February 2025
Basha Shek
గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది స్టార్ హీరోయిన్ సమంత. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది.
ఇటీవల సామ్ నటించిన సిటాడెల్ హనీ-బన్నీ వెబ్ సిరీస్ కు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం సామ్ రక్త బ్రహ్మాండ్ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ ప్రమోషన్ ఈవెంట్ లో తన మొబైల్ చేతిలో పట్టుకుని ఫొటోకు ఫోజులుచ్చింది.
ఆ సమయంలో సమంత ఫోన్ వాల్ పేపర్ క్లియర్ గా కనిపించింది. ఆమె ఫోన్ వాల్ పేపర్‌గా దేవుని ఫొటో పెట్టుకుంది.
లింగభద్రదేవి ఫొటోను సమంత తన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరలవుతోంది.
కాగా గతంలో నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించినప్పుడు కూడా సమంత ఫోన్ వాల్ పేపర్ గురించి అడగ్గా ఈ ఫొటోనే చూపించింది.
మొత్తానికి విడాకుల తర్వాత హీరోయిన్ సమంతకు దేవుళ్లపై భక్తి పెరిగిపోయింది అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..