AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరివెన్నెల స్మృతిలో ‘స్వప్నాల నావ’ సాంగ్.. యూట్యూబ్‌లో యమా ట్రెండింగ్..

మనసంతా నువ్వే,  నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా 'స్వప్నాల నావ' రూపొందింది. డల్లాస్‌కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన గోపీకృష్ణ కొటారు 'శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్' అనే నిర్మాణ సంస్థను..

సిరివెన్నెల స్మృతిలో 'స్వప్నాల నావ' సాంగ్.. యూట్యూబ్‌లో యమా ట్రెండింగ్..
Sirivennela
Ravi Kiran
|

Updated on: Feb 20, 2025 | 10:04 PM

Share

మనసంతా నువ్వే,  నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా ‘స్వప్నాల నావ’ రూపొందింది. డల్లాస్‌కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన గోపీకృష్ణ కొటారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘స్వప్నాల నావ’ ని రూపొందించడం జరిగింది. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ ‘స్వప్నాల నావ’ థీమ్ విషయానికి వస్తే ఇది.. దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దీనిని మలిచారు.

‘ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి దీనికి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ గాయకుడు,సంగీత దర్శకుడు  పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకి ఎంతో అభిమానం అని అందరికీ తెలిసిన సంగతే. ఆయన సూపర్ హిట్ సినిమా ‘మనసంతా నువ్వే’లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు ‘స్వప్నాల నావ’తో సిరివెన్నెల గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటి చెప్పారు ఆదిత్య. అందుకే ప్రేక్షకుల నుండి ‘స్వప్నాల నావ’కి విశేషాదరణ లభిస్తుంది. తాజాగా యూట్యూబ్లో  ఈ పాటకు 1 మిలియన్ వీక్షణలు నమోదయ్యాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్