ఆ హీరో విడాకులకు నేనే కారణం అంటున్నారు : దివ్యభారతి
Rajeev
20 February 2025
Credit: Instagram
దివ్య భారతి చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడు ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి.
ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది.
దీంతో ఈ అమ్మడుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఫస్ట్ మూవీతోనే యువతలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది.
మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. తాజాగా దివ్యభారతి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కింగ్ స్టన్ అనే సినిమాలో జీవి ప్రకాష్ తో మరోసారి కలిసి నటిస్తుంది. అయితే జీవీ ప్రకాష్ విడాకులకు కారణం తానే అని చాలా విమర్శలు వచ్చాయని చెప్పుకొచ్చింది.
బ్యాచిలర్ లో మా మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. దీంతో మేము రిలేషన్‌లో ఉన్నామని, అందుకే ప్రకాష్ తన భార్యకి విడాకులు ఇచ్చారని దారుణంగా మాట్లాడారంటూ దివ్యభారతి చెప్పుకొచ్చింది.