AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: నేను మాట మీద నిలబడే వ్యక్తిని.. షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం

రణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘క’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లింది.

Kiran Abbavaram: నేను మాట మీద నిలబడే వ్యక్తిని.. షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2024 | 10:01 AM

Share

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘క’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన క రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన క బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

క సినిమా ప్రస్తుతం ఓఐటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్ గానే క సినిమా ఓటీటీలోకి వచ్చింది. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్లు కలకలం రేపాయి. కిరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు. క సినిమా హిట్ అవ్వకపోతే సినిమాలు వదిలేస్తా అని.. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా అని కిరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

ఇక క సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నవంబరు 28 నుంచి ఇది ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఒక్క రోజులోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే తాజాగా క మూవీ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికి థాంక్స్. మా నమ్మకాన్ని మించి పెద్ద విజయాన్ని అందించారు అని కిరణ్ అబ్బవరం అన్నారు. తెలుగులో డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజన్‌లో ఓటీటీలో వచ్చిన తొలి సినిమా మాదే. అందుకు సంతోషంగా ఉంది అని కిరణ్‌ అబ్బవరం అన్నారు.ఈ సినిమా విజయం సాదించకపోతే ఇండస్ట్రీ వదిలేస్తా అన్నారు నిజంగానే వదిలేసేవారా..? అన్న ప్రశ్నకు కిరణ్ సమాధానం ఇస్తూ.. నేను మాట మీద నిలబడే మనిషిని అని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!