బుల్లితెరపై టాప్ యాంకర్స్‌లలో ఓంకార్ ఒకరు. పలు రియాల్టీ షోలతో బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. కేవలం టీవీ షోలలో మాత్రమే కాకుండా.. వెండితెరపై జీనియస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక అదే సినిమాతో ఆయన సోదరుడు అశ్విన్ బాబు హీరోగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అశ్విన్ బాబు వెండితెర అరంగేట్రం చేసి చాలా కాలమే అయిన… బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఇంతవరకూ 6 సినిమాలు చేసిన ఆయన, తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రాజు గారి గది సినిమాల ద్వారా అశ్విన్ బాబు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతను హీరోగా ఓ సరికొత్త ప్రాజెక్టులో నటించబోతున్నాడు. తన కెరీర్లో 7వ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. #AB7 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీలుక్ పోస్ట్రర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో రక్తం ఓడుతున్న చేతితో హీరో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఫస్టులుక్ ను రేపు మధ్యాహ్నం 2:52 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రీ లుక్ ద్వారా చెప్పారు. టైటిల్ ను కూడా రేపు రివీల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ విగ్నేస్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వికాస్ సంగీతం అందిస్తున్నారు.
ట్వీట్..
Here’s a Pre Look Poster of My Next project with
Dir @anikanneganti
Producer #GangaPatnamSridhar in #SvkCinemas #AB7 Title and First look Releasing Tomorrow@Nanditasweta @Actorysr @VidyuRaman @kuncheraghu @DopRajasekarB @vikasbadisa @UrsVamsiShekar pic.twitter.com/aYV6ZB13q6— AshwinBabu (@iamashwinbabu) July 31, 2021
Also Read: