రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు సమీపిస్తోంది. జనవరి 8న ఈ స్టార్ హీరో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అదే రోజు ‘టాక్సిక్’ చిత్రం నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు అది నిజమైంది. దీనికి సంబంధించి ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఇది విని అభిమానులు కూడా థ్రిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. రాకింగ్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10.25 గంటలకు ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసేందుకు ‘టాక్సిక్’ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఆ రోజున పెద్ద అప్ డేట్ రావడం ఖాయమని టాక్సిక్ టీమ్ తెలిపింది. ఇది యశ్ అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ప్రస్తుతం విడుదలైన పోస్టర్‌లో యష్ పాత కారుపై నిలబడి ఉన్నాడు. అతని నోటిలో సిగరెట్ ఉంది. టోపీ పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించాడు యశ్ . ఇంతకుముందు, టైటిల్ టీజర్‌ను ప్రకటించేటప్పుడు కూడా, యష్ తలపై టోపీ ధరించి కనిపించాడు. ఈ లుక్ సినిమాలో కూడా కంటిన్యూ అవుతుందని అంటున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోయర్లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.
Surprises don’t knock .. they are unleashed.#TOXIC #TOXICTheMovie @TheNameIsYash #GeetuMohandas @KVNProductions #MonsterMindCreations @Toxic_themovie pic.twitter.com/Yj3zeg1GXE
— KVN Productions (@KvnProductions) January 6, 2025
Mastered song for
” Toxic : A fairy tale for grown ups ” with the help of AI
Edit by @Yashpire great work 🔥👌 #1YearOfToxicTitle #ToxicTheMovie #YashBoss #Toxic @TheNameIsYash pic.twitter.com/0gNd2TMNEr— 𝘼𝘽𝙃𝘼𝙔🕊️ (@abhay_tweetzz) December 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.