Yami Gautam: ఫోటో అడిగాడని ఓకే చెప్తే ఆ అభిమాని అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

|

Feb 28, 2023 | 5:23 PM

ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో కెమెరా జూమ్ చేసి మరి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అలియా భట్ అసహనం వ్యక్తం చేసింది. ఇది కరెక్ట్ కాదు మాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది అంటూ ఫైర్ అయ్యింది.

Yami Gautam: ఫోటో అడిగాడని ఓకే చెప్తే ఆ అభిమాని అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
Yami Gautam
Follow us on

సినిమా తారలకు క్రేజ్ తో పాటు అదే రేంజ్ లో ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమా తారలు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో కెమెరా జూమ్ చేసి మరి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అలియా భట్ అసహనం వ్యక్తం చేసింది. ఇది కరెక్ట్ కాదు మాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది అంటూ ఫైర్ అయ్యింది. అలియా భట్ కు మద్దతుగా బాలీవుడ్ మొత్తం గొంతు కలిపింది. అయితే చాలా మంది మాకు కూడా ఇలానే జరిగింది అని చెప్పుకొచ్చారు. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్. హీరోయిన్స్ బయట కనిపిస్తే చాలు తమ కెమెరాలలో బంధించడానికి చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. అలాగే యామీ గౌతమ్ ఫోటోలు కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

ఒకరోజు తన స్వగ్రామానికి వెళ్లిందట ఈ అందాల భామ. అయితే అక్కడ ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు అడిగాడట. కుదరదు అని చెప్పిన వినకుండా ఆమెను ప్రాధేయపడ్డాడట. పోనీలే అని ఓకే చెప్పిందట. అయితే అతను మాత్రం వీడియో తీసి దాన్ని అసభ్యకరంగా ఎడిట్ చేశాడట. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్ ఆ వీడియోపై స్పందించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పుకొచ్చింది యామీ గౌతమ్.