ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరిగా రాణిస్తున్నారు నిర్మాత దిల్ రాజు(Dil Raju). దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయినా దిల్ రాజు. తొలి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. ఇండస్ట్రీలో దాదాపు బడా హీరోలందరితో సినిమాలు చేశారు దిల్ రాజు. పెద్ద హీరోల సినిమాలే కాదు.. కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. అయితే చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చూసిన దిల్ రాజుకు ఎట్టకేలకు వకీల్ సాబ్ రూపంలో అవకాశం దక్కింది. పవర్ స్టార్ పర్ఫెక్ట్ కంబ్యాక్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దిల్ రాజుకు మరో కోరిక ఉందట. అదే మెగాస్టార్ చిరంజీవి సినిమా. మెగాస్టార్ సినిమాను ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నారు దిల్ రాజు. అదే తన డ్రీమ్ అని కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఓన్ ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదల ప్రొడక్షన్ తో పాటు ఇతర బ్యానర్లతో ఆయన భాగస్వామ్యం అవుతూ సినిమాలు చేస్తున్నారు. దాంతో దిల్ రాజుకు అవకాశాలు దొరకడం లేదు. కానీ ఇప్పుడు ఆ మెగా ఛాన్స్ కొట్టేశారని తెలుస్తోంది. చిరంజీవి కోసం ఏకంగా ఆరు కథలను సిద్ధం చేయించారట దిల్ రాజు. మెగాస్టార్ కు వీలు కుదిరినప్పుడు ఆ కథలను వినిపించి ఒక కథను ఓకే చేసి సినిమా చేయాలనీ చూస్తున్నారట ఈ స్టార్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత దిల్ రాజుకు అవకాశం వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి మెగాస్టార్ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ దిల్ రాజు కొట్టేశారన్నది ఫిలింనగర్ టాక్.