Venkatesh: అదిరిందయ్యా గురూజీ..! వెంకీ మామకు జోడీగా యంగ్ బ్యూటీ

సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు సరైన సినిమా పడాలే గానీ రికార్డులు ఏ స్థాయిలో గల్లంతు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల హిట్ చూసిన వెంకీ మామ.. తన తర్వాతి సినిమాపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.

Venkatesh: అదిరిందయ్యా గురూజీ..! వెంకీ మామకు జోడీగా యంగ్ బ్యూటీ
Venkatesh

Updated on: Sep 02, 2025 | 3:32 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ మూడు సినిమాలు చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకంఠాపురంలో సినిమాల్లో ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారని టాక్ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అలాగే ఎక్కువ సమయం పట్టనుంది. దాంతో త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.  ఆయన ఎవరో కాదు వెంకటేష్. త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

వెంకటేష్ , త్రివిక్రమ్ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమం జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. తనదైన కామెడీ డైలాగ్స్ ఫ్యామిలీ డ్రామా కథను సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ అందాల భామను సెలక్ట్ చేశారట డైరెక్టర్ త్రివిక్రమ్. ఆ హీరోయిన్ ఎవరో కాదు కేజీఎఫ్ తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టి.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ అమ్మడిని వెంకటేష్ సినిమా కోసం సెలక్ట్ చేశారట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.