
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వయసు గురించి ఆలోచించకుండా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కూలీ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్ గా నటించి మెప్పించారు. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపించి మెప్పించారు. ఇక కూలి సినిమా తర్వాత ఇప్పుడు రజినీకాంత్ కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్నారు. ఇద్దరు లెజెండ్రీ హీరోలు కలిసి ఇప్పుడు ఓ మల్టీస్టారర్ మూవీతో రాబోతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి గతంలో 11 సినిమాల్లో నటించారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు తిరిగి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో గాని ఈ సినిమా నుంచి సుందర్ సి తప్పుకున్నారు. ఈమేరకు మీడియాకు ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో ఓ యంగ్ డైరెక్టర్ రజినీకాంత్, కమల్ మల్టీ స్టారర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తుంది. రామ్‌కుమార్ బాలకృష్ణన్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో రామ్‌కుమార్ బాలకృష్ణన్ పార్కింగ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని కోలివుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.