Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29: ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అయిన రాజమౌళి.. మహేష్ సినిమాలో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం వంటి హిట్ మూవీ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని జక్కన్న భారీ హైప్ మధ్య హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

SSMB 29: ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీ అయిన రాజమౌళి.. మహేష్ సినిమాలో లేడీ విలన్‌గా స్టార్ హీరోయిన్
Ssmb 29
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2025 | 4:52 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకో మూడు నాలుగేళ్లు పడుతుంది. మహేష్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా ఈసినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు మహేష్ బాబు. తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు.

SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాను జక్కన్న నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోతోపాటు ప్రియాంక పాత్రకు సైతం ప్రాధాన్యత ఉంటుందని..ఆ పాత్రకు ఆమె న్యాయం చేయగలదని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక ఈ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఆమె పాత్రను మునుపెన్నడూ చూడని విధంగా రాజమౌళి రూపుదిద్దుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌లో కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కెన్యా అడవుల్లో చిత్రీకరించనున్నారు. అలాగే ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నారు. ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రాకుండా కొన్ని కండీషన్స్ పెట్టారట రాజమౌళి.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి