AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్

యువతను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. క్యూట్ లుక్స్ తో కేక పెట్టించింది. ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనేలా కుర్రాళ్ళు కలలు కనేలా చేసింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను అలరించింది. ప్రేమలు సినిమా తర్వాత ఈ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలించారు. 

Mamitha Baiju: అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
Mamitha Baiju
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2024 | 10:07 AM

Share

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఆ లిస్ట్ లో ప్రేమలు సినిమా ఒకటి. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. యువతను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. క్యూట్ లుక్స్ తో కేక పెట్టించింది. ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనేలా కుర్రాళ్ళు కలలు కనేలా చేసింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను అలరించింది. ప్రేమలు సినిమా తర్వాత ఈ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలించారు.

ఈ ముద్దుగుమ్మ ఎవరు.? ఎక్కడ పుట్టింది.? ఏం సినిమాలు చేసింది.? అంటూ తెగ వెతికేశారు నెటిజన్స్. దాంతో మమిత క్రేజ్ పెరిగిపోయింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది మమితా బైజు. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఖో ఖో చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ ఆమె గెలుచుకుంది  ఈ బ్యూటీ.

ఇది కూడా చదవండి :Nandamuri Mokshagna: ఇదెక్కడి మాస్ రా మావా..!! నందమూరి మోక్షజ్ఞకు జోడీగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్

ఇక ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ చిన్నది తెలుగులో సినిమా చేయనుందని టాక్ వినిపిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమాలో మమితా బైజు నటిస్తుందని తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమాలోనూ మమితా బైజు నటిస్తుందట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరో సినిమాలో మమితా బైజు స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడే కెరీర్ లో ఫస్ట్ గేర్ వేసిన ఈ చిన్నది అప్పుడే స్పెషల్ సాంగ్ చేయడం ఏంటి.? అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదు అని కొట్టిపారేస్తున్నారు ఫ్యాన్స్. హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు అప్పుడే స్పెషల్ సాంగ్ చేయదు అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.