
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ డేస్ లో బాలకృష్ణ చేసిన సినిమాల వరుస విజయాలను అందుకుంటున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. చివరిగా డాకు మహారాజ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు బాలయ్య. ఇక ఇప్పుడు అఖండ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు. ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇదిలా ఉంటే బాలకృష్ణ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ రాబోయే సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. అది కూడా మహారాణి పాత్రలో నటించనుందని తెలుస్తుంది. గతంలో బాలయ్యబాబుతో కలిసి మూడు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. ఆ మూడు సినిమాలు మంచి విజయలను అందుకున్నాయి.
అఖండ 2 తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం గోపిచంద్ మలినేని అదిరిపోయే కథను సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ సినిమాలో నయన తార హీరోయిన్ గా నటిస్తుందని.. అది కూడా ఆమె ఓ మహారాణి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రాజు పాత్రలో కనిపించనున్నారట. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.