AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ ఫౌజీ సినిమాలో మరో హీరోయిన్.. హాట్ బ్యూటీకి క్రేజీ ఛాన్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్నారు.

Prabhas: ప్రభాస్ ఫౌజీ సినిమాలో మరో హీరోయిన్.. హాట్ బ్యూటీకి క్రేజీ ఛాన్స్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2025 | 7:41 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు , సినీ ప్రముఖులు డార్లింగ్ కు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా నేడుడు. ఆయా సినిమాల నుంచి పోస్టర్స్ కూడా విడుదలయ్యి  ఈ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ తో సలార్ 2సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కల్కి2 , వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటే హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .

ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన ప్రేమకథ గా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ‘సీతా రామం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ‘ఫౌజీ’ చిత్ర బృందం ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపిందని, అతనికి కూడా కథ నచ్చి ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని టాక్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. ఎక్కడో ఫారెన్‌లో రీల్స్ చేసుకునే ఈ అమ్మాయి అనుకోకుండా తన డ్యాన్స్ ట్యాలెంట్‌తో హను రాఘవపూడి కంట పడింది.. దాంతో దెబ్బకు జాతకం మారిపోయింది. ప్రస్తుతం ఫౌజీలో నటిస్తున్న ఈ బ్యూటీకి.. ఇది సెట్స్‌పై ఉండగానే మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తుంది తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు కన్నడ నటి చైత్ర జె. ఆచార్ . ఫౌజీ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ పోస్ట్ షేర్ చేసింది. “ఫౌజీ ఒక అద్భుతమైన సృష్టి, హను రాఘవపూడి ఒక మాంత్రికుడులాంటి డైరెక్టర్” అంటూ పోస్ట్ షేర్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..