AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: నయనతార అవుట్.. బాలయ్యకు జోడీగా స్టార్ హీరోయిన్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Balakrishna: నయనతార అవుట్.. బాలయ్యకు జోడీగా స్టార్ హీరోయిన్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2026 | 7:24 AM

Share

నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. అంతే కాదు ఇటీవలి కాలంలో బాలయ్య చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. థియేటర్స్ దగ్గర బాలయ్య సినిమాల సందడి మాములుగా ఉండదు.. అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. దర్శకనిర్మాతలు కూడా బాలయ్యను అదే రేంజ్ లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే..

ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య, గోపీచంద్ మలినేని కలిసి అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి ప్రీ లుక్ పోస్టర్స్ ను కూడా విడుదల చేశారు. అలాగే బాలయ్యకు జోడీగా నయనతారను కూడా ఫిక్స్ చేశారు. బాలయ్య, నయనతార కలిసి గతంలో శ్రీరామ రాజ్యం, సింహ, జై సింహ సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి బాలయ్యతో నయన్ జోడీ కట్టనుంది అని అనౌన్స్ చేశారు.. కానీ

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చిందని తెలుస్తుంది. బాలయ్య కొత్త సినిమాలో నయనతార ప్లేస్ లోకి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాజల్ అగర్వాల్ బాలయ్యతో గతంలో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె కొన్ని పాత్రలకే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు బాలయ్య, గోపీచంద్ సినిమాలో కాజల్ పాత్ర ఫుల్ లెన్త్ ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరో 20 రోజులు వీరికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
మరో 20 రోజులు వీరికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలా..
కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలా..
షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన
షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన
శని అమావాస్య నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
శని అమావాస్య నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి
ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి
టీ20 చరిత్రలో రెండోసారి అరుదైన రికార్డు
టీ20 చరిత్రలో రెండోసారి అరుదైన రికార్డు
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..