Keerthy Suresh: రాజకీయాల్లోకి మహానటి.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న కీర్తిసురేష్ .?
సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికే కొంతమంది రాజకీయాల్లో ఉండగా యంగ్ హీరోయిన్స్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఇప్పుడు మరోబ్యూటీ కూడా రాజకీయ ప్రవేశం చేయనుందని టాక్ వినిపిస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మలు కొంతమంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గ్లామర్ ఫీల్డ్ లో రాణించిన కొంతమంది ఇప్పుడు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికే కొంతమంది రాజకీయాల్లో ఉండగా యంగ్ హీరోయిన్స్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఇప్పుడు మరోబ్యూటీ కూడా రాజకీయ ప్రవేశం చేయనుందని టాక్ వినిపిస్తుంది. ఆ భామ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తన సహజ నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇక ఈ అమ్మడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తిసురేష్ ఇప్పుడు రాజకీయాల్లోకి రానుందని టాక్ వినిపిస్తోంది.
కీర్తిసురేష్ రాజకీయాల్లోకి రాబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్ రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీర్తి పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడంతో ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతుందని ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు ఎన్నోకల్లో ఆమె సందడి చేయనుందని తెలుస్తోంది. కీర్తిసురేష్ ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తో సినిమా చేస్తుంది. మామన్నన్ అనే సినిమాలో నటిస్తున్న సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ ను రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా.? అని ప్రశ్నించగా.. దాని గురిని ఆలోచించాలి అని సమాధానం చెప్పారు. దాంతో ఆమె భవిషత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.




