
దీపికా పదుకొణెకు తెలుగు దర్శకులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మొన్నామధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికా మీద సంచలన ఆరోపణలు చేశారు. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ సినిమాకు కూడా దీపిక నే హీరోయిన్ అనుకున్నారు. అయితే వివిధ కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని కథానాయికగా ఎంచుకున్నారు. కాగా ఒక బిడ్డకు తల్లి అయిన దీపికా పదుకొనే రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించడని తెలుస్తుంది. అలాగే స్పిరిట్ మూవీ స్టోరీని దీపికా పీఆర్ టీమ్ లీక్ చేసిందని వార్తలు వచ్చాయి. దీని పై కూడా సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి కూడా దీపికను తప్పించారు. బడా నిర్మాత అశ్వినీదత్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి దీపికా పదుకొనేను తొలగించారు. ఇటీవలే మేకర్స్ అఫీషియల్ గా దీపికా కల్కి సీక్వెల్ లో నటించడం లేదు అని తెలిపారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడంలాంటి కమిట్మెంట్స్ తన సినిమాకు సెట్ అవ్వవని మేకర్స్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికా ప్లేస్ లో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈమేరకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపికా ప్లేస్ లో పూజా హెగ్డే నటిస్తుందని కొందరంటుంటే.. మారికొందరు ఆమె ప్లేస్ లో అనుష్క శెట్టి నటిస్తుందని అంటున్నారు. కల్కి సినిమాలో దీపికా పదుకొణె అయితేనే సెట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కల్కి సినిమాలో ఆమె పాత్రలో మరో హీరోయిన్ నటించే అవకాశం లేదాని ఆమె పాత్రను మొదటి పార్ట్ తోనే ముగిస్తారని అంటున్నారు. దీని పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దీపికాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగ్ అశ్విన్. సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడి చిత్రంలోని కృష్ణుడి ఎంట్రీ సీన్ ను నాగ్ అశ్విన్ షేర్ చేస్తూ..” కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే” అనే డైలాగ్ షేర్ చేశారు. ఇప్పటికే దీపికా పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి