Naga Chaitanya: లెజెండరీ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు తెలుగులో ఫస్ట్‌ మువీ ‘చై’తో చేయడానికి కారణమిదే.. ‘మా మధ్య ఆ ఒప్పందం జరిగింది’

|

May 09, 2023 | 3:43 PM

అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగ చైతన్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చై హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మువీ మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చై కస్టడీ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు...

Naga Chaitanya: లెజెండరీ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు తెలుగులో ఫస్ట్‌ మువీ చైతో చేయడానికి కారణమిదే.. మా మధ్య ఆ ఒప్పందం జరిగింది
Naga Chaitanya
Follow us on

అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగ చైతన్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చై హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మువీ మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చై కస్టడీ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. నా మనసును గాయపరిస్తే ఎక్కడిదాకైనా వెళ్తా.. అనే డైలాగ్‌ ఫ్యాన్స్‌లో హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇది కేవలం యాక్షన్‌ మువీ మాత్రమేకాదు ఫ్యామిలీ డ్రామాగా కూడా ఉండబోతుందన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. న్యాయం కోసం ఎంతదూరం వెళ్తాడనేదే కస్టడీలో నా క్యారెక్టర్‌ ఉంటుంది. ఇది యాక్షన్‌ మువీ మాత్రమేకాదు దీని వెనుక చాలా లేయర్స్ ఉన్నాయి.

జోష్ నుంచి 25 మువీస్‌ చేశారు కదా. వాటిల్లో యాక్షన్‌ మువీస్‌ నిరాశపరిచాయి. కానీ లవ్‌ స్టోరీస్‌, డ్రామా బేస్‌ స్టోరీస్‌ బాగా వర్కౌట్‌ అయ్యాయి. కస్టడీ యాక్షన్‌ మువీలో మళ్లీ ఎందుకు సెలెక్ట్‌ చేసుకున్నారు అని జర్నలిస్ట్‌ ప్రశ్నకు చై బదులిస్తూ.. కస్టడీ యాక్షన్‌తోపాటు హ్యూమన్‌ డ్రామాలా ఉంటుంది. కస్టడీలో యాంగర్‌ కొంత భిన్నంగా ఉంటుంది. నిజానికి ఈ మువీ 1980లో జరిగే కథ. నా పాత్రలో లోపల కోపం ఉన్నప్పటికీ బయటకు ఎక్ప్‌ప్రెస్‌ చెయ్యడం ఉండదు. సందర్భం కోసం ఎదురుచూస్తుంటాడు. శివ మువీలో మాదిరి ఉంటుందని చై చెప్పుకొచ్చారు.

తమిళ్‌లో సినిమాలు తీసే వెంకట్‌ ప్రభు తెలుగులో తొలిసారి కస్టడీకి చైని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అనే ప్రశ్నకు.. ‘ఏమాయ చేశావే షూటింగ్‌నుంచి వెంకట్ ప్రభుతో కలిసి జర్నీ చేస్తున్నాను. నాకొక తెలుగు సినిమా చేయాలని ఉంది. అందుకే ఇక్కడికి వస్తున్నాను అయన అన్నారు. మరి నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడుగగా.. లవ్‌స్టోరీ చూసి నాకు అవకాశం ఇచ్చానన్నారు. నాకు కూడా తమిళ్‌లో చేయాలనే కోరిక కూడా ఉంది. నేను మిమ్మల్ని తెలుగుకి తీసుకొస్తా.. నన్ను తమిళ్‌కి తీసుకెళ్లండి అని అడిగాను. కస్టడీ తమిళ్‌, తెలుగు భాషల్లో వస్తుంది.. దీంతో మా జర్నీ కూడా స్టార్ట్‌ అయ్యిందని చై వెల్లడించారు. కాగా కస్టడీ మువీలో అరవింద్‌ స్వామీ, శరత్‌ కుమార్‌, రేవతి వంటి సీనియర్‌ యాక్టర్లు ప్రత్యేక పాత్రల్లో నటించారు. సంగీత మాంత్రికుడు ఇలయరాజా (కంపోజిషన్‌), ఆయన కొడుకు యువన్‌ శంకర్‌రాజా (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఇద్దరి కాంబినేషన్‌లో పాటలు అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.