రాంచరణ్‌తో మొదటి సినిమాకి నో అన్న రాజమౌళి..!
చెర్రీతో.. మొదటి సినిమా చేసేందుకు.. రాజమౌళికే ఫస్ట్ ఆఫర్ వచ్చిందట. ఈ అవకాశాన్ని స్వయంగా.. చిరంజీవినే.. రాజమౌళికి ఇచ్చారట. కానీ.. అందుకు రాజమౌళి ‘నో’ అన్నాడట. నిజానికి.. టాప్ హీరోల వారసులను.. సినిమాలకు పరిచయడం చేయడమంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. కత్తి మీద సాములాంటిది. దానికి తోడు చాలా బాధ్యతలు ముడిపడి ఉంటాయి. అన్నింటినీ.. బ్యాలెన్స్ చేస్తూ.. డైరెక్టర్ సినిమా.. చేయాల్సి ఉంటుంది. అందుకే.. చాలా మంది వారసుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూంటారు డైరెక్టర్స్. ఇలాంటి సమస్యనే.. […]
చెర్రీతో.. మొదటి సినిమా చేసేందుకు.. రాజమౌళికే ఫస్ట్ ఆఫర్ వచ్చిందట. ఈ అవకాశాన్ని స్వయంగా.. చిరంజీవినే.. రాజమౌళికి ఇచ్చారట. కానీ.. అందుకు రాజమౌళి ‘నో’ అన్నాడట. నిజానికి.. టాప్ హీరోల వారసులను.. సినిమాలకు పరిచయడం చేయడమంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. కత్తి మీద సాములాంటిది. దానికి తోడు చాలా బాధ్యతలు ముడిపడి ఉంటాయి. అన్నింటినీ.. బ్యాలెన్స్ చేస్తూ.. డైరెక్టర్ సినిమా.. చేయాల్సి ఉంటుంది. అందుకే.. చాలా మంది వారసుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూంటారు డైరెక్టర్స్.
ఇలాంటి సమస్యనే.. రాంచరణ్ విషయంలో కూడా జరిగిందట. మెగా వారసుడిని సిల్వర్ స్క్రీన్‌కి పరిచయడం చేయడమంటే.. మామూలు విషయం కాదు కదా..! అప్పటికే.. రాజమౌళి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో.. చిరంజీవి ఈ అవకాశం అతనికే ఇద్దామనుకున్నారట. కానీ.. అందుకు రాజమౌళి నో అని చెప్పి.. రెండో సినిమా చేద్దామని చెప్పారట. ఎందుకంటే.. రాజమౌళి.. అప్పటికే.. ఓ సినిమాతో బిజీగా ఉన్నాడట. అందులోనూ.. రాంచరణ్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి.. రెండో సినిమా చేద్దామని చెప్పారట.
దీంతో.. ఈ అవకాశం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సొంతమైంది. కథ కూడా నచ్చడంతో.. చిరు, చరణ్‌లు పూరీకి ఓకే చెప్పేశారు. ‘చిరుత’ అనే బ్లాక్ బస్టర్ టైటిల్‌తో చరణ్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు పూరీ. ఇక ఆ తర్వాత అనుకున్నట్లుగా.. చెర్రీతో రెండో సినిమా ‘మగధీర’ తీశాడు దర్మక ధీరుడు రాజమౌళి.