స్పీచ్‌లెస్ అన్న సమంత.. బ్రైయిన్‌లెస్ అంటోన్న నెటిజన్లు
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల 33వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి పుట్టినరోజును అభిమానులు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే బొబ్బిలికి చెందిన సాగర్ అనే వ్యక్తి.. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మోకాలి మీద సింహాచలం మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అది కాస్త వైరల్‌గా మారి.. సమంత వద్దకు చేరుకుంది. దీంతో దీనిపై స్పందించిన చైతూ సతీమణి.. […]
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల 33వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి పుట్టినరోజును అభిమానులు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే బొబ్బిలికి చెందిన సాగర్ అనే వ్యక్తి.. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మోకాలి మీద సింహాచలం మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అది కాస్త వైరల్‌గా మారి.. సమంత వద్దకు చేరుకుంది. దీంతో దీనిపై స్పందించిన చైతూ సతీమణి.. ‘‘థ్యాంక్యు. ఇది నిజంగా అద్భుతం. మాటలు రావడం లేదు. వచ్చి మమ్మల్ని కలవండి’’ అని కామెంట్ పెట్టింది.
ఇక ఈ ట్వీట్‌పై చై-సామ్ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్లు పెట్టినప్పటికీ.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. “అది స్పీచ్‌లెస్ కాదు బ్రెయిన్ లెస్”.. “ఇలాంటివి ఎంకరేజ్ చేయడం మానేయండి”.. “మీ ఇంట్లో వారి కోసం ఎప్పుడైనా ఇలా చేశారా..?” “అభిమానం ఉండాలి కానీ పిచ్చి వెర్రి అభిమానం ఉండకూడదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Thankyou … this is incredible .. speechless ? please meet us ?? https://t.co/zgy03ZLfft
— Samantha Akkineni (@Samanthaprabhu2) November 24, 2019
కాగా చైతూ ఒక్కడికే కాదు.. తమ అభిమాన హీరోహీరోయిన్లల బర్త్‌డేలు వచ్చాయంటే.. వారి అభిమానులు వినూత్నంగా తమ ప్రేమను చాటుకోవడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. అంతేనా.. కొంతమందైతే అభిమానం పేరుతో తమ ప్రాణాలపైకి కూడా తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తమ పేరు మీద ఏదైనా మంచి పని చేయండి కానీ.. తమ కోసం ప్రాణాలను పోగొట్టుకోకండి అంటూ పలువురు హీరోలు అభిమానులను అప్పుడప్పుడూ వారిస్తుంటారు.